భార్యలు జాగ్రత్త పడాల్సిందే.. 40 ఏళ్లు దాటిన మగవారిలో ఈ సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉన్నట్టే!

40 ఏళ్లు దాటితే సాధారణంగా ప్రతి ఒక్కరిని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వేధించడం మొదలుపడతాయి అందులో ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు మరింత వేధిస్తాయి మధుమేహం రక్తపోటు మొదలైపోతాయి

భార్యలు జాగ్రత్త పడాల్సిందే.. 40 ఏళ్లు దాటిన మగవారిలో ఈ సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉన్నట్టే!


40 ఏళ్లు దాటితే సాధారణంగా ప్రతి ఒక్కరిని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వేధించడం మొదలుపడతాయి అందులో ముఖ్యంగా వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు మరింత వేధిస్తాయి మధుమేహం రక్తపోటు మొదలైపోతాయి నరాల బలహీనత కండరాల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తాయి అయితే 40 ఏళ్లు దాటిన మగవారిని వేధించే సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 

సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత మగవారిలో కొన్ని రకాల సమస్యలు మొదలవుతాయి అందులో ముఖ్యంగా వెన్నునొప్పి ఒకటి. మగవారు ఆఫీసులో ఎక్కువ సమయం పని చేయటం బయట వాహనాలు నడపటం వంటి వాటితో వెన్నునొప్పి సమస్య వేధించే అవకాశం ఉంటుంది. 

కండరాల నొప్పులు..

తీసుకునే ఆహారంలో సరిపడా కాల్షియం లేనప్పుడు కండరాల నొప్పులు వేధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది అందుకే ఈ సమయంలో పోషకాహారం తీసుకోవడం అత్యవసరం..

టెస్టిక్యులర్‌ క్యాన్సర్..

40 ఏళ్ల తర్వాత మగవారికి టెస్టిక్యులర్‌ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే.. విజయంతంగా చికిత్స చేయవచ్చు.

బెల్లీ ఫ్యాట్‌..

40 ఏళ్లు పైబడిన చాలా మంది పురుషులకు పొట్ట ఎక్కువగా వస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకు పోతుంది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు మీద పడటం సరైన వ్యాయామం లేకపోవడం జీవితంలో బిజీ అయిపోవడంతో ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించలేరు ఈ సమయంలోనే ఊబకాయంతో పాటు మరిన్ని సమస్యలు వేధిస్తాయి.

మధుమేహం..

కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఈ వ్యాధి 40 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మధుమేహం వచ్చిన తర్వాత జీవన శైలిలో చాలా మార్పులు చేసుకోవాలి తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా బయట సమస్యలతో సతమవుతమవుతున్న మగవారు ఆరోగ్యం పై పూర్తిగా దృష్టి సారించలేరు అందుకే వారి ఆరోగ్యం పై భార్యలు కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి లేదంటే ఎన్నో రకాల సమస్యలు తలెత్తి అవకాశం ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.