వేసవిలో బీర్ తాగేస్తున్నారా?.. జర జాగ్రత్త.. లేదంటే..!

ఈ వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా మండి పోతున్నాయి. బయట అడుగుపెట్టాలంటే భయమేస్తోంది. ముఖ్యంగా ప్రతిఒక్కరికీ దాహం ఎక్కువగా ఉంటుంది. ఎంత నీరు తాగినా.. దాహం తీరదు. గొంతు ఎండిపోతూ ఉంటుంది. చెమట రూపంలో శరీరం నుంచి నీరు

వేసవిలో బీర్ తాగేస్తున్నారా?.. జర జాగ్రత్త.. లేదంటే..!


ఈ వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా మండి పోతున్నాయి. బయట అడుగుపెట్టాలంటే భయమేస్తోంది. ముఖ్యంగా ప్రతిఒక్కరికీ దాహం ఎక్కువగా ఉంటుంది. ఎంత నీరు తాగినా.. దాహం తీరదు. గొంతు ఎండిపోతూ ఉంటుంది. చెమట రూపంలో శరీరం నుంచి నీరు బయటికి వెళ్లిపోతుంది. డిహైడ్రేట్​ కూడా అవుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది శీతల పానీయాలు తాగడానికి ఎక్కువగా ఇష్ట పడతారు. ఇక మందు బాబులు చెప్పనక్కర్లేదు. భగ భగ మండే ఎండల్లో చల్లగా ఉండే బీర్‌ కోసం ఎగబడుతుంటారు. ప్రశాంతంగా కూర్చొని బీర్​ తాగుతుంటారు. అయితే ఇప్పటికే ఈ వేసవి కాలంలో  నగరంలోని మందు బాబులు కోటికిపైగా బీర్లు తాగేశారని లెక్కలు కూడా వచ్చాయి. ఇక వేసవి పూర్తయ్యేసరికి.. ఇంకా ఎన్ని  బీర్లు తాగుతారో చూడాలి. అయితే వేసవి కాలంలో ఇలా బీరు తాగడం చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు.

These Are The Beers of Summer | Beverage Dynamics

సాధారణంగా బీరు తాగితే.. శరీరం ఉపశమనం పొందుతుందని మందు బాబులు భావిస్తారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని  అంటున్నారు నిపుణలు. 

విపరీతంగా బీరు తాగడం వల్ల.. శరీరంలో మరింత హీట్‌ ఎక్కువ అవుతుందని అంటున్నారు.  కూల్​గా ఉండే ప్రాంతాల్లో .. వేడి కోసం ఆల్కహాల్‌ తాగుతారు. అందుకు కారణం.. దాని వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని అంటున్నారు.

కిడ్నీ సంబంధిత సమస్యల సైతం తలెత్తే అవకాశం ఉంది అంతేకాకుండా జీర్ణశక్తి లోపించటం వికారంగా అనిపించడం పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కానీ మనదేశంలో అధికంగా బీర్లు తాగే వారిని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మందుబాబులు వారానికి కేవలం మూడు బీర్లు మాత్రమే తాగాలని లేదంటే ఎక్కువ తీసుకుంటే పేగు చుట్టూ కొవ్వు ఏర్పడటం వంటి సమస్యలు కలుగుతాయని చెబుతున్నారు. 

మండిపోతున్న ఈ ఎండల్లో వేసవిలో కొబ్బరి బొండం నీళ్లు తాగడం మంచిదని ..  అది శరీరాన్ని చల్ల బరుస్తుంది అంటున్నారు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు.. కొబ్బరి బొండాలు ఎక్కువగా తాగకూడదు అని చెప్పారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.