డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి? ఎప్పుడు తీసుకోవాలి?

ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువమంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాలి.. తీపి పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి.. అయితే మునుపటిలాగా ఏది పడితే అది తినకూడదు.

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి? ఎప్పుడు తీసుకోవాలి?


ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువమంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడాలి.. తీపి పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి.. అయితే మునుపటిలాగా ఏది పడితే అది తినకూడదు.. చాలా జాగ్రత్తగా ఎంపిక చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి..డయాబెటిస్‌ను సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిల్లర్‌ అంటారు. దీర్ఘకాలం రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. గుండె సమస్యలు, కిడ్నీ జబ్బులు, కంటి సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే, ఇది వచ్చిన తర్వాత బాధపడటం కంటే, రాకుండా జాగ్రతపడటం మంచిది. షుగర్‌ పేషెంట్స్‌ ముందుగా 'ప్రీ డయాబెటిక్' స్టేజ్‌ను దాటే డయాబెటిక్‌గా మారతారు.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నిర్దేశించిన విలువ‌ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే డ‌యాబెటిస్ అంటారు. షుగర్‌ లెవల్స్‌ మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా కొంచెం బార్డ‌ర్ లైన్‌లో ఉన్నా, లేదా కొద్దిగా ఎక్కువ‌గా ఉన్నా దాన్ని ప్రీ డ‌యాబెటిస్ అంటారు. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉన్నవారు వారి లైఫ్‌స్టైల్‌, ఆహారం మీద్ద శ్రద్ధ వహించపోతే.. డయాబెటిక్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రీ డ‌యాబెటిస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు.. ఆ తర్వాత స్టేజ్‌ను నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రీ డయాబెటిక్స్‌ ఫుడ్‌ ప్లేట్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


రోజుకు రెండు రకాల కూరగాయలైనా వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ కూరగాయలలో ఫైబర్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల ఆధారిత ఫైబర్ రక్తంలో చక్కెర పెరగకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. కూలగాయలలో పోషఖకాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారీ.. ఆహారంలో అరకప్పు ఉడికించిన కూరగాయలు లేదా 1 కప్పు వెజిటబుల్ సలాడ్ తీసుకోండి. వీటిలో ఉప్పు వేసుకోకపోవడమే మంచిది. కారెట్, క్యాప్సికమ్,బ్రోకలీ,ఆకుకూరలు, కాలే వంటి కూరగాయలు తీసుకోండి.


మీ ఆహారంలో బంగాళదుంపలు, చిలగడదుంపలు, మొక్కజొన్న, గుమ్మడికాయ వంటి కూరగాయలను.. తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీ డైట్‌లో నాలుగింట ఒక వంతు మాత్రమే తినాలి. వీటిలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. పండ్లలో సహజమైన చక్కెరలు ఉంటాయి. పండ్లలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. రోజుకు రెండు నుంచి మూడు సర్వింగ్స్‌ పండ్లు తీసుకోండి. మీ డైట్‌లో బెర్రీ, కివి, పుచ్చకాయ, సిట్రస్‌ పండ్లు, అవకాడో తీసుకోండి. 


అలాగే..ప్రీ డ‌యాబెటిక్స్‌ ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోండి. తృణధాన్యాలలో ఫైబర్‌, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. మీ డైట్‌లో ఓట్స్,బ్రౌన్ రైస్, ఓల్‌ వీట్‌, క్వినోవా, రెడ్‌ రైస్‌ తీసుకోండి. ఇకపోతే.. నట్స్‌, విత్తనాలలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రీ డయాబెటిక్స్‌ నట్స్‌, విత్తనాలు మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారంలో వాల్‌నట్స్‌, పిస్తా, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, జీడిపప్పు, బాదం తీసుకోండి.ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి..మీ ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా చేర్చుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ప్రోటీన్‌లు.. కార్బోహైడ్రేట్లు రక్తప్రవాహంలోకి నెమ్మదిగా వెళ్లేలా సహాయపడతాయి. మీకు డయాబెటిస్‌ రాకుండా ఉండాలంటే.. ప్యాటీ ఫిష్‌, సీఫుడ్, బీన్స్, పప్పులు. మొక్కల ఆధారిత ప్రోటీన్, గుడ్డు, తక్కువ కొవ్వు ఉన్నపాలు, లీన్‌ మాంసాలు తీసుకోండి.. అలాగే షుగర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి.. ఒక టైమ్ ప్రకారం తీసుకోవడం మంచిది..

షుగర్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు...

మీ ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా చేర్చుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ప్రోటీన్‌లు.. కార్బోహైడ్రేట్లు రక్తప్రవాహంలోకి నెమ్మదిగా వెళ్లేలా సహాయపడతాయి. మీకు డయాబెటిస్‌ రాకుండా ఉండాలంటే.. ప్యాటీ ఫిష్‌, సీఫుడ్, బీన్స్, పప్పులు. మొక్కల ఆధారిత ప్రోటీన్, గుడ్డు, తక్కువ కొవ్వు ఉన్నపాలు, లీన్‌ మాంసాలు తీసుకోండి.. అలాగే షుగర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి.. ఒక టైమ్ ప్రకారం తీసుకోవడం..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.