గర్భధారణలో గుడ్డు తింటే పుట్టే బిడ్డకి జుట్టు రాదా!

సాధారణంగా స్త్రీ గర్భం ధరించిన దగ్గర నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చుట్టూ ఉండేవారు ఎన్నో రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. వాటితో సందేహాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి

గర్భధారణలో గుడ్డు తింటే పుట్టే బిడ్డకి జుట్టు రాదా!


సాధారణంగా స్త్రీ గర్భం ధరించిన దగ్గర నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చుట్టూ ఉండేవారు ఎన్నో రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. వాటితో సందేహాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. అయితే చాలా కాలం నుంచి ఉన్న ఒక అపోహ గర్భధారణ సమయంలో గుడ్డును తినకూడదు అని. అయితే ఇందులో నిజం ఏంటో తెలుసుకుందాం.
Eating Eggs Safely During Pregnancy | Is Eating Eggs During Pregnancy Safe
సాధారణంగా గర్భిణీ స్త్రీ భయపడటం, బాధపడటం కన్నా చక్కని ఆలోచనతో ముందుకు సాగితే గర్భధారణ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో బిడ్డ ఆరోగ్యానికి తల్లి తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యమని చెప్పాలి. 
గుడ్డులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో గుడ్డును తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు.
అయితే గర్భధారణ సమయంలో గుడ్డులో పచ్చ సొన ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని వలన కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే రోజు కనీసం ఒక గుడ్డును తీసుకోవడం మంచిది. దీనిలో తెల్లటి భాగాన్ని తీసుకోవడం వల్ల శిశువుకు కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అలాగే జుట్టు పెరగడానికి గుడ్డు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పుట్టే బిడ్డ జుట్టుకు గుడ్డుకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ సమయంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా గుడ్డును తీసుకోవచ్చు.
బెల్లం, నెయ్యితో చేసిన మినప సున్నుండలు వేయించిన కొద్దిపాటి జీడిపప్పు, బాదం, మినప గారెలు వంటివి గర్భిణీ స్త్రీ తీసుకోవడం మంచిది. రాత్రిపూట పాలు తాగటం కూడా ఉత్తమం. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కారం, మసాలాలు తగ్గించి నువ్వులు, బొప్పాయి వంటి వాటిని తీసుకోకపోవడం మేలు. అలాగే గర్భధారణ సమయంలో ఇంగువ నా సైతం తీసుకోకూడదని హెచ్చరిస్తూ ఉంటారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.