Pregnancy : ప్రెగ్నెన్సీ ఎనామిలీ స్కాన్ పూర్తి వివరణ.. 

Pregnancy Anomaly Scan : గర్భధారణ సమయంలో స్కానింగ్ ఎంతో ముఖ్యమైన భాగం.  అలాగే ముఖ్యంగా 20 వారాలు గడిచాక ఎనామిలి స్కాన్ చేయించుకోమని వైద్యులు చెబుతారు.. అయితే ఈ స్కాన్ యొక్క

Pregnancy  : ప్రెగ్నెన్సీ ఎనామిలీ స్కాన్ పూర్తి వివరణ.. 
anomaly scan in pregnancy


Pregnancy Anomaly Scan : గర్భధారణ సమయంలో స్కానింగ్ ఎంతో ముఖ్యమైన భాగం.  అలాగే ముఖ్యంగా 20 వారాలు గడిచాక ఎనామిలి స్కాన్ చేయించుకోమని వైద్యులు చెబుతారు.. అయితే ఈ స్కాన్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే.. 

సాధారణంగా ఎలా 18 నుంచి 21 వారాలు మధ్య ఎప్పుడైనా చేయించుకోవచ్చు దీనిని ప్రెగ్నెన్సీ స్కాన్ గా పిలుస్తారు.. ఈ 20 వారాలప్పుడు చేసే స్కానింగ్ ఆంటీనేటల్ కేర్‌లో ఒక భాగం. ఇందులో బేబీ ముఖ కవలికలను తొలిసారిగా స్కాన్ రూపంలో కనిపిస్తాయి..  ముఖ్యంగా ఇందులో సోనోగ్రాఫర్ నిర్వహిస్తారు..  గర్భంలో పెరుగుతున్న బేబీ అవయవాలు ఆకృతిని క్షుణ్ణంగా వివరిస్తుంది ఈ స్కాన్.. 

ఇందులో క్లెఫ్ట్ లిప్(పెదాల చీలిక), స్పైనా బైఫైడా (వెన్నుముక సరైన ఆకృతికి రాకపోవడం), ఎడ్వర్డ్ సిండ్రోమ్ (అదనపు క్రోమోజోమ్స్ ఉండడం), కంజెషనల్ హార్ట్ డిసీజ్(సీహెచ్‌డీ) వంటి ముఖ్యమైన విషయాలను స్కాన్ చేస్తుంది.. అంతేకాకుండా ప్లెసెంటా పొజిషన్ కూడా తెలుపుతుంది.. అలాగే హెడ్ సర్కఫెరెన్స్, అబ్‌డామినల్ సర్కమ్‌ఫెరెన్స్, థైబోన్ లెంథ్ కొలతలు తీసుకుంటారు.

అలాగే ఈ స్కాన్లో బేబీ ముఖం, చేతులు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే సోనోగ్రాఫర్ బేబీ అవయవాల మెజర్‌మెంట్స్ కూడా నోట్ చేసుకుంటారు. అలాగే ఇందులో బేబీ తల బ్రెయిన్ స్ట్రక్చర్ పూర్తిగా పరిశీలిస్తారు అలాగే అంతర్గత అవయవాల ఎదుగుదలను పరిశీలించడంతోపాటు గుండె చప్పుడు లోపల గదులు బేబీ కిడ్నీలు వాటి పనితీరు వంటివన్నీ పరిశీలిస్తారు అలాగే బేబీకి బ్రెయిన్ సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఇందులో తెలుస్తాయి అలాగే చేతులు కాళ్లు పాదాలు వేలు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు.. 

స్కానింగ్ తీసే సమయంలో బేబీ పొల్యూషన్ సరిగ్గా లేకపోతే మళ్లీ రెండోసారి చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు.. అలాగే గర్భిణీ ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నట్టయితే సోనోగ్రాఫర్‌కు బేబీ అవయవాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. అందువల్ల 23వ వారంలో మరోసారి సిఫారసు చేయవచ్చు. అలాగే బేబీకి హార్ట్ ప్రాబ్లెమ్ ఉన్నట్టు గమనిస్తే ఫెటల్ ఎకో స్కాన్ చేయించాలని చెబుతారు. దీనివల్ల బేబీలో గుండెకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో తెలుస్తాయి.

ఇలా ప్రెగ్నెన్సీ సమయంలో చేసే ఎనామిలీ బిడ్డ యొక్క పూర్తి పొజిషన్ ను తెలుపుతుంది. అంతేకాకుండా గర్భధారణలో ఎలాంటి సమస్యలు ఉన్నా బిడ్డకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మొత్తం వివరిస్తుంది.. ఈ స్కాన్ పూర్తయ్యాక డాక్టర్ పుట్టే బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఒక అవగాహనకు వస్తారు. అంతేకాకుండా దీని ప్రకారమే గర్భిణీలకు మందులు రాసి ఇవ్వటం, తగిన విధంగా జాగ్రత్తలు చెప్పటం జరుగుతుంది.. సాధారణంగా ఐదో నెలలో జరిగే ఈ స్కాన్ తర్వాత పిండంలో ఎలాంటి లోపాలు ఉన్నా తల్లి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు గర్భం నిలవదు అనే విషయాన్ని సైతం ఈ స్కాన్ తర్వాతే వైద్యులు వివరిస్తారు. అందుకే ప్రతి ఒక్క మహిళ గర్భధారణ సమయంలో ఎనామిలి స్కాన్ చేయించుకోవడం తప్పనిసరి.. అలాగే ఈ స్కాన్ కు వెళ్లేముందే గర్భిణీ దీని కోసం అన్ని వివరాలు తెలుసుకోవడం వల్ల ఎలాంటి సంకోచం లేకుండా అపోహలన్నీ తొలగించుకొనే అవకాశం ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.