Brain Stroke Symptoms : బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలివే.. !

Brain Stroke Symptoms : బ్రెయిన్ స్ట్రోక్ చాలా దారుణమైన ఆరోగ్యం పరిస్థితి దీన్నే బ్రెయిన్ ఎటాక్ అని కూడా పిలుస్తారు అయితే దీన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రాణానికే ప్రమాదం అని తెలుస్తోంది

Brain Stroke Symptoms : బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కనిపించే లక్షణాలివే.. !
Brain Stroke Symptoms


Brain Stroke Symptoms : బ్రెయిన్ స్ట్రోక్ చాలా దారుణమైన ఆరోగ్యం పరిస్థితి దీన్నే బ్రెయిన్ ఎటాక్ అని కూడా పిలుస్తారు అయితే దీన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రాణానికే ప్రమాదం అని తెలుస్తోంది బ్రెయిన్ స్ట్రోక్ ను ఎలా గుర్తించాలి అంటే..

సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ ఎటాక్ మెదడు లోని కొంత భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు వస్తుంది అలాగే మెదడులోని ఎక్కడైనా రక్తనాళం పగిలినప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్ కనిపిస్తుంది.. అందుకే ఈ పరిస్థితుల నుంచి కచ్చితంగా మనిషి తనను తాను కాపాడుకోవాలి..

సాధారణంగా ఒక వయసు దాటిపోయిన తర్వాత అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది ఇలాంటి వారిలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.. 

బ్రెయిన్ స్ట్రోక్ ను ముందుగా గుర్తించాలి అంటే స్లీప్ అప్నియా గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. ఇంకొక విషయం ఏంటంటే స్లీప్ అప్ నియా ఉన్నవారికి అది ఉందనే సంగతి కూడా తెలియదు.. కానీ ఈ సమస్య ఉన్న వారిలో ఎక్కువ మందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం మాత్రం ఉందని తెలుస్తోంది అయితే స్లీప్ అప్నియా  యొక్క లక్షణాలు ఏంటంటే.. 

అధిక గురక..
నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు..
నిద్రలో నోటితో గాలి పీల్చడం.. 
మౌత్ డ్రై అయిపోవటం.. 
నిద్ర లేవగానే తలనొప్పి
నిద్రలేమి
పగటి పూట నిద్రపోవాలి అనిపించడం
ఏ విషయం పైన శ్రద్ధ ఉండకపోవడం
చిరాకు

అలాగే మెదడులోని ఏవైనా భాగాలకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి అంతే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కూడా ఇవే లక్షణాలు ఉంటాయి అందులో ముఖ్యంగా.. ముఖం, చేయి, కాలులో ఏదైనా భాగం విపరీతంగా లాగుతున్నట్టు అనిపించి తిమ్మిరి పట్టడం.. లేదా పక్షవాతం వచ్చే లక్షణాలు కనిపించడం.. కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, మాటల్లో తడబాటు, విపరీతమైన తలనొప్పి.. నడకలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.. 

బ్రెయిన్ స్ట్రోక్ నుండి బయటపడాలి అంటే కచ్చితంగా శరీరంలో రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి అలాగే సరైన ఆహార పదార్థాలు తీసుకోవాలి మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి వీలైతే రోజు కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి అధిక ఒత్తిడికి గురి అవ్వకూడదు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.