Kidney : మొక్కజొన్న పీచుతో కిడ్నీ సమస్యలను నయం చేసుకోవచ్చు..!

Kidney : మన శరీరాన్ని క్లీన్‌ చేసుకోడానికి స్నానం చేస్తాం.. పళ్లు క్లీన్‌ చేసుకోవాడని రోజు బ్రష్‌ చేస్తాం.. కానీ లోపల మీకు ఉన్న ప్రతి అవయవాన్ని క్లీన్‌ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు.. అదేంటి అవేందుకు క్లీన్‌ చేయడం అంటారా..?

Kidney : మొక్కజొన్న పీచుతో కిడ్నీ సమస్యలను నయం చేసుకోవచ్చు..!


Kidney : మన శరీరాన్ని క్లీన్‌ చేసుకోడానికి స్నానం చేస్తాం.. పళ్లు క్లీన్‌ చేసుకోవాడని రోజు బ్రష్‌ చేస్తాం.. కానీ లోపల మీకు ఉన్న ప్రతి అవయవాన్ని క్లీన్‌ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు.. అదేంటి అవేందుకు క్లీన్‌ చేయడం అంటారా..? పైకి కనిపించే శరీరాన్ని క్లీన్‌ చేయడం ఎంత ముఖ్యమో.. లోపల ఉన్న అవయవాలను క్లీన్‌ చేయడం కూడా అంతే ముఖ్యం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యగా ఉంటాం.. మూత్ర‌పిండాల ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తిన్నా వాటిలో మ‌లినాలు పేరుకుపోయి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇది మ‌ర‌ణానికి కూడా దారి తీస్తుంది. మూత్రపిండాలను క్లీన్‌ చేసుకోవడానికి కొన్ని చిట్కాలను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ చిట్కాల‌ను వారినికి ఒక‌సారి వాడితే చాలు మూత్ర‌పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో మ‌న‌కు పుచ్చ‌గింజ‌ల టీ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ టీ ని మ‌నం తాజా పుచ్చ‌గింజ‌ల‌తో లేదా మార్కెట్‌లో దొరికే ఎండిన పుచ్చ గింజ‌ల‌తో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనికోసం ముందుగా 2 టీ స్పూన్ల పుచ్చ‌గింజ‌ల‌ను తీసుకుని పొడిగా చేసుకోవాలి.
త‌రువాత ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక అందులో పుచ్చ‌గింజ‌ల పొడిని వేసి 5 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని ఒక బాటిల్ నిల్వ చేసుకుని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాలన్ని తొల‌గిపోతాయి. ఈ టీని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.  

మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌రిచే మ‌రో చిట్కా 

మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో మొక్క‌జొన్న పొత్తులో ఉండే పీచు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నం సాధార‌ణంగా ఈ పీచును ప‌డేస్తూ ఉంటాం. కానీ ఈ మొక్క‌జొన్న పీచుతో టీ ని తయారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ పీచుతో టీని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు శుభ్ర‌ప‌డ‌తాయి.మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుంచి కూడా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు. గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్, రక్తపోటు వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. 
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక గుప్పెడు మొక్క‌జొన్న పీచును వేసి నీళ్లు రంగు మారే వ‌ర‌కు మ‌రిగించండి.. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక బాటిల్‌లోకి తీసుకోవాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు శుభ్ర‌ప‌డ‌తాయి. వాటి ఆరోగ్యం మెరుగుప‌డి ప‌నితీరు మెరుగుప‌డుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.