ఎండాకాలంలో సెగ గడ్డలు.. వేడి కురుపుల సమస్యా..? అర్రే..ఇలా చేయండి మరీ..! 

అదేంటో.. వర్షకాలం వస్తే వాతావరణం బాగుంటుంది కానీ.. రోగాలు ఎక్కువగా వస్తాయి.. ఎప్పుడెప్పుడు సమ్మర్‌ స్టాట్‌ అవుతుందా ఈ సీజనల్‌ డిసీసెస్‌ తగ్గుతాయా అనుకుంటాం.. సమ్మర్‌ నేను ఏమన్నా తక్కువా అన్నట్లు..

ఎండాకాలంలో సెగ గడ్డలు.. వేడి కురుపుల సమస్యా..? అర్రే..ఇలా చేయండి మరీ..! 


అదేంటో.. వర్షకాలం వస్తే వాతావరణం బాగుంటుంది కానీ.. రోగాలు ఎక్కువగా వస్తాయి.. ఎప్పుడెప్పుడు సమ్మర్‌ స్టాట్‌ అవుతుందా ఈ సీజనల్‌ డిసీసెస్‌ తగ్గుతాయా అనుకుంటాం.. సమ్మర్‌ నేను ఏమన్నా తక్కువా అన్నట్లు.. ఈ సీజన్‌లో వచ్చేవి కూడా ఉన్నాయి.. ముఖ్యంగా సమ్మర్‌లో అందరికీ చెమటకాయలు, వేడిపొక్కులు, చర్మంపైగుల్లలు, సెగ్గెడ్డలు ఇలా ఏవేవో వస్తాయి..పేర్లు వేర్లు అయినా.. ఇవి రావడానికి ప్రధాన కారణం.. ఒంట్లో వేడి ఎక్కువ అవడం.. అయితే ఇవి కేవలం వేడి చేసి మాత్రమే ఇవి రావు.. ఇవి రావడానికి బ్యాక్టిరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా ఒక కారణం.. మరి ఇలాంటి గుల్లలు వచ్చాయి అంటే ఒక్క పట్టాన పోవు.. రెండు నెలలు అయినా ఉంటాయి.. వీటిని వదిలించుకునే చిట్కాలు కొన్ని మీకోసం..


సెగకురుపులు తగ్గాలంటే ఇలా చేయండి..

  • బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గుల్లల్లో ఉండే చీము బయటకు రావడానికి గడ్డల్లా తయారవుతుంది. కానీ వేడివలన కాదు. ఇలా సెగకురుపులు లేదా చర్మంపై ఏర్పడే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కి రోజూ హనీ, లెమన్ వాటర్ రోజుకు ఐదారు సార్లు తాగాలి. నాలుగు స్పూన్ల తేనె, అరచెక్క నిమ్మరసం కలపి తాగొచ్చు..
  • రోజుకు నాలుగు లీటర్ల మంచినీళ్ళు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న టాక్సిన్లు, విషవ్యర్థాలు బయటకు పోతాయి. నీళ్లు తక్కువగా తాగడం వల్ల బాడీ డీహైడ్రట్‌ అయ్యి ఇలాంటి కురుపులు వస్తాయి.. కాబట్టి రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీళ్లు అయినా తాగొచ్చు. ఇలా తాగితే... పాత కురుపులు తగ్గి కొత్తగా రాకుండా చేస్తాయి. రోజుకు రెండు సార్లు విరోచనం అయ్యేలా చేస్తుంది.
  • తేనె తాగడం వలన వేడి చేయదు.
  • రోజుకు రెండు బోండాలు కొబ్బరినీళ్ళు తాగొచ్చు.
  • జ్యూస్లు, కూరగాలరసాలన్నీ ఎక్కువగా తీసుకోండి. అలా చేయడం వలన రక్తశుద్ధి జరిగి బాక్టీరియా ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి.
  • యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న పండ్లు తీసుకోవడం వలన బాక్టీరియా తగ్గుతుంది.
  • ఉదయాన్నే వెజిటబుల్ జ్యూస్, సాయంత్రం ఒక పళ్శ రసం త్రాగాలి. త్వరగా ఆహారం తీసుకోవాలి. టాక్సిన్లు బయటకు పోవడం వలన సెగకురుపులు రాకుండా ఉంటాయి. 

ఇలా చేస్తే ఆరోగ్యంతోపాటు సెగగడ్డలు, కురుపులు కూడా తగ్గుతాయి. 

ఇలా చేయడం వల్ల కేవలం ఈ కురుపులే కాదు.. రక్తంలో ఉండే మలినాలు అన్ని పోయి.. స్కిన్‌ లోపల నుంచి క్లీన్‌ అవుతుంది. ముఖంలో కాంతి పెరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.