Fertility : నిద్ర తగ్గితే.. పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుందంటున్న నిపుణులు..!!

Fertility : నిద్ర తగ్గితే.. ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు కానీ.. పిల్లలు కూడా పుట్టరని మీకు తెలుసా..? నిపుణులు ఇదే అంటున్నారు..ప్రెగ్నెన్సీ రావడంలో పలు జీవనశైలి అలవాట్లు ప్రభావం చూపుతాయి

Fertility : నిద్ర తగ్గితే.. పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతుందంటున్న నిపుణులు..!!


Effects off Fertility : నిద్ర తగ్గితే.. ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు కానీ.. పిల్లలు కూడా పుట్టరని మీకు తెలుసా..? నిపుణులు ఇదే అంటున్నారు..ప్రెగ్నెన్సీ రావడంలో పలు జీవనశైలి అలవాట్లు ప్రభావం చూపుతాయి. స్మోకింగ్, ఆల్కహాల్ తాగడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి చెత్త అలవాట్లు గర్భధారణ అవకాశాలను దెబ్బతీస్తాయి. ఇక హైబీపీ, డయాబెటిస్, ఒబెసిటి వంటి అనారోగ్య పరిస్థితులు కూడా సంతానోత్పత్తి రేటును ప్రభావితం చేేస్తాయి. అయితే మీరు నిద్ర పోయే తీరు కూడా సంతానోత్పత్తిని ప్రభావం చేస్తుందని నిపుణులు అంటున్నారు..
181,100+ Cute Baby Boy Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock | Cute baby boy white background
ఒక వ్యక్తి శారీరక, మానసిక, భావోద్వేగ సంబంధిత ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా అవసరం.. నిద్ర లేమి సమస్యలు అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. పురుషులూ, స్త్రీలూ అందరిపైనా ఈ ప్రభావం పడుతుంది. అయితే మీరు గాఢంగా నిద్ర పోతే మీ శరీరంలో టిష్యూలు తిరిగి కోలుకుంటాయి. అంటే రిపేర్ అయి కొత్త కణాలు వృద్ధి చెందుతాయన్నట్లు.. దీర్ఘకాలికంగా నిద్ర లేమి కేవలం స్ట్రెస్, యాంగ్జైటీకి మాత్రమే కారణం కాదు.. అది మీ సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా పెను ప్రమాదాన్ని చూపుతుంది.నిద్రకు, ఫెర్టిలిటీకి మధ్య గణనీయమైన సంబంధం ఉందని ఫెర్టిలిటీ డాక్టర్లు అంటున్నారు..  

ఫెర్టిలిటీపై నిద్ర ప్రభావం ఇలా ఉంటుందంటే..

నిద్ర లేమి వల్ల ఫెర్టిలిటీ సామర్థ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏంట్రా అంటే.. హార్మోన్ల ఉత్పత్తిలో సమస్యలు. నిద్ర లేమి కారణంగా హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యత ఏర్పడుతుందట. కొన్ని రకాల హార్మోన్లు అపరిమితంగా పెరుగితే.. మరికొన్ని రకాల హార్మోన్లు తగ్గిపోతాయి.. ఇది మీ ఫర్టిలిటీ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. ఒవల్యూటరీ డిస్‌ఫంక్షన్ (అండాశయ సామర్థ్య లోపం), రుతుచక్రంలో అసాధారణతలు, మహిళల్లో సంతాన లేమి సమస్యలు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడం, స్పెర్మ్ మార్ఫాలజీలో అసాధారణతలకు నిద్ర లేమి సమస్యలకు మధ్య సంబంధం ఉంది. హార్మోన్ల అసమతుల్యత లిబిడో తగ్గడానికి కారణమవుతుంది.
దీనికి తోడు నిద్ర లేకపోతే శరీరం ఒత్తిడి హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ఘోరంగా దెబ్బతీస్తుంది. ఈస్ట్రోజెన్, టెస్టొస్టెరాన్, ఇతర సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్ల స్థాయిని దెబ్బతీస్తుంది. నిద్ర, మెలకువకు సంబంధించిన హార్మోన్లను (మెలటోనిన్, కార్టిసాల్) నియంత్రించే మెదడులోని భాగం కూడా రోజువారీగా రీప్రొడక్టివ్ హార్మోన్ల విడుదలను ప్రభావితం చేస్తుంది. చీకటి పడ్డాక మెలటోనిన్ అనే హార్మోన్‌ను మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. అది మన నిద్రపోయే, మెలకువ వచ్చే సైకిల్‌ను నియంత్రిస్తుందట...
హార్మోన్‌ ఒక శక్తిమంతమైన యాంటాక్సిడెంట్. ఇది ఒవల్యూషన్‌కు చేరుకునే అండాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. అండాల నాణ్యతను తగ్గించే ఇతర హానికారకాలపై కూడా పోరాడుతుంది. ఎక్కువ కాంతి, ముఖ్యంగా సెల్ ఫోన్లు, టీవీల ద్వారా వచ్చే కాంతి మన శరీరంలోని మెలటోనిన్ సైకిల్స్‌ను ప్రభావితం చేస్తుంది. దీంతో అండాల నాణ్యత దెబ్బతింటుంది. నిరంతరం నిద్ర లేమితో బాధపడితే లుటైనైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్). ఒవల్యూషన్‌కు దోహదం చేసే హార్మోన్ ఎల్‌హెచ్ అనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.