డయాబెటిస్ బాధితులకు బీ అలెర్ట్.. ప్రతీరోజూ రాత్రి ఇలా చేస్తే డయాబెటిస్ కంట్రోల్!

డయాబెటిస్.. ఇది దీర్ఘకాలిక రోగం. డయాబెటిస్ ను  సకాలంలో నియంత్రించకపోతే.. హార్ట్ స్ట్రోక్ , బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే సరైన ఆహారం తీసుకుంటూ, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే డయాబెటిస్ ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించొచ్చని  వైద్య నిపుణులు చెబుతున్నారు. 

డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి రాత్రిపూట కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

1. డయాబెటిక్ బాధితులు రాత్రివేళ చిరుతిండ్లు తినకూడదు.
2.  అలాగే రాత్రిపూట తక్కువ తినడం మంచిది. అది కూడా ఏడు గంటల లోపే భోజనం చేయడం మరింత మంచిది.  
3. ఈ రోగ బాధితులు ప్రతి రోజూ 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలి.
4. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాలంటే..  కచ్చితంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి, ప్రొటీన్లు పెంచుకోవాలి. మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
5. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు చామంతి టీ తాగితే డయాబెటిస్ అదుపులోకి ఉంటుందట. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
6. నిద్రకు ముందు వాకింగ్ చేయడం కూడా డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది.
7. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఏడు నుంచి ఎనిమిది  నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల కూడా షుగర్ లెవెల్ అదుపులోకి వస్తుంది. 
8. రోజు ఉదయాన్నే నిద్ర లేచాక పరగడుపున ఒక టేబుల్ స్పూన్ మెంతిపొడి తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. 
9. నానబెట్టిన మెంతుల నీళ్లు తీసుకున్న ప్రయోజనం ఉంటుంది.
10.  రాత్రి భోజనం చేసిన తర్వాత,  పడుకునే ముందు 15 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చుంటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.