ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ కాగానే ఈ జాగ్రత్తలు తీసుకోండి..! అస్సలు మర్చిపోకండి..!

ఒక స్త్రీ గర్భిణీగా మారడం, గర్భిణీ తల్లిగా మారడం ప్రతి ఆడపిల్ల జీవితంలో జరుగుతుంది. కానీ అది ఒకప్పటి మాట.. నేటి జీవనశైలి వల్ల ఏదో ఒక స్టేజ్‌లో ఈ ప్రాసెస్‌ ఫెయిల్‌ అవుతోంది. అయితే అసలే గర్భదాల్చకపోవడం, లేదా గర్భందాల్చినా.. డెలివరీ కాకుండా గర్భస్రావం అవడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అవగానే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. గర్భస్రావం అవకుండా

ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ కాగానే ఈ జాగ్రత్తలు తీసుకోండి..! అస్సలు మర్చిపోకండి..!


ఒక స్త్రీ గర్భిణీగా మారడం, గర్భిణీ తల్లిగా మారడం ప్రతి ఆడపిల్ల జీవితంలో జరుగుతుంది. కానీ అది ఒకప్పటి మాట.. నేటి జీవనశైలి వల్ల ఏదో ఒక స్టేజ్‌లో ఈ ప్రాసెస్‌ ఫెయిల్‌ అవుతోంది. అయితే అసలే గర్భదాల్చకపోవడం, లేదా గర్భందాల్చినా.. డెలివరీ కాకుండా గర్భస్రావం అవడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అవగానే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. గర్భస్రావం అవకుండా పండంటి బిడ్డకు జన్మనివ్వొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మొదటి మూడు నెలలు చాలా కీలకం. మొదటి పన్నెండు వారాల సమయంలో అలసట, బరువు పెరగడం, ఉదయం పూట కాస్త నీరసంగా ఉండటం, మూడ్ స్వింగ్స్ ఇలా చాలా మార్పులు కనిపిస్తాయి. పిండం యొక్క ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందడం ఈ మొదటి త్రైమాసికంలోనే మొదలవుతాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. గర్భనిర్ధారణ కాగానే తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..!
Confirming your Pregnancy - India Parenting

పాత ట్యాబ్లెట్లు:

ఇది వరకు ఏదైనా అనారోగ్య సమస్య ఉండి ట్యాబ్లెట్లు వాడుతుంటే ఇపుడు అవి కొనసాగించడం కుదరకపోవచ్చు. ఏమైనా మార్పులు చేయాల్సి రావచ్చు. మీరు దేనికోసం ట్యాబ్లెట్లు వాడుతున్నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వైద్యుల్ని సంప్రదించాలి. అలాగే జలుబే కదా, జ్వరమే కదాని మాత్రలు వేసుకోకూడదు. డాక్టర్ సలహా లేనిది ఏ చిన్న మాత్ర కూడా వేసుకోకూడదు.

విటమిన్లు:

డాక్టర్ సూచించినట్లుగా విటమిన్ ట్యాబ్లెట్లు తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ లాంటి సప్లిమెంట్లు ఇస్తే వాటిని క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఐరన్ మాత్రలు కూడా మీకు వైద్యులు సూచిస్తే మర్చిపోకుండా వేసుకోండి.

టెస్టులు:

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే HIV పరీక్ష, STD (లైంగికంగా సంక్రమించే వ్యాధులు) పరీక్షలు చేయించుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్లు ప్రెగ్నెన్సీ మీద ప్రభావం చూపిస్తాయి. వీటితో పాటూ డాక్టర్ సూచించిన ఎలాంటి పరీక్షలైనా నిర్ణిత సమయంలో చేయించుకోవడం మర్చిపోవద్దు.

కెఫీన్:

ఆల్కహాల్, కెఫీన్, టొబాకో ఈ మూడింటి జోలికి అస్సలు పోకూడదు. దీనివల్ల పిండానికి ప్రమాదం. దీని ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. ఎక్కువగా కాఫీలు తీసుకోవడం వల్ల నెలలు నిండకముందే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సోడాలు, కూల్ డ్రింకులు, బ్లాక్ టీలో కూడా కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు కన్నా ఎక్కువ టీ లేదా కాఫీ తీసుకోకూడదు. వీలైతే పూర్తిగా మానేయడం మంచిది.

ఆహారం:

ఎక్కువగా విత్తనాలు, గింజలు తీసుకోవాలి. ఒమేగా 3 యాసిడ్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి బిడ్డ మెదడు, కళ్లు, నరాలు తయారవ్వడానికి సాయపడతాయి. గుడ్లు, పాలు, ట్యూనా, సాల్మన్ చేపల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బ్రొకోలి, పాలకూర, టోఫు, పాల ఉత్పత్తుల్లో క్యాల్షియం ఉంటుంది. వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోవాలి.

డాక్టర్‌ని కలవడం:

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వెంటనే వైద్యుల్ని కలవాలి. ఇదివరకు ఏమైనా సమస్యలుంటే అన్ని విషయాలు చెప్పేయాలి.

వ్యాయామాలు:

సులువైన వ్యాయామాలు చేయడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. పార్కులో ఉదయం పూట లేదా సాయంత్రం వాకింగ్ చేయడం మంచిది. అయితే వెనక్కి వంగే వ్యాయామాలు, పొత్తి కడుపు మీద బలం పెట్టి చేసే వాటికి దూరంగా ఉండాలి. యోగా చేసేముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకుంటే మేలు. మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు ఏవైనా సూచిస్తారు.

తగిన నీరు తాగడం:

రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. తాజా పండ్ల రసాలు, స్మూతీలు తీసుకుంటుండాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.