వక్షోజాల ఆకృతికి ఇవి చేయాలి?

స్త్రీలు వక్షోజాలకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అవి ఏమాత్రం సరైన స్థితిలో లేకపోయినా అందంగా లేమనే భావనకు వచ్చేస్తారు. అంతేందుకు శృంగారంలో మొదటి స్థానం వక్షోజాలే. వదులుగా ఉంటే మాత్రం అందవిహీనంగా కనిపించే ఛాన్స్‌ కూడా ఉంది.

వక్షోజాల ఆకృతికి ఇవి చేయాలి?


స్త్రీలు వక్షోజాలకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అవి ఏమాత్రం సరైన స్థితిలో లేకపోయినా అందంగా లేమనే భావనకు వచ్చేస్తారు. అంతేందుకు శృంగారంలో మొదటి స్థానం వక్షోజాలే. వదులుగా ఉంటే మాత్రం అందవిహీనంగా కనిపించే ఛాన్స్‌ కూడా ఉంది. నిండైన ఎద అందాల కోసం ఖర్చుపెట్టని వారు లేకపోలేదు అంటే అతిశయోక్తి కాదు. అందుకే సినిమా తారలు, మోడల్స్ శరీర సౌష్టవం, వక్షోజాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు.

Breast Cancer Symptoms । ఈ 5 లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌కు ప్రారంభ సంకేతాలు,  ఆలస్యం చేయవద్దు!-keep an eye on these early 5 symptoms of breast cancer get  treated before it get worse

పెళ్లి అయి పిల్లలు పుట్టాక వక్షోజాలు వదులుగా తయారవుతాయి. ఎందుకంటే పసిపిల్లలకు పాలు పట్టడం, ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల దానిపై అంతగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉండదు. ఇలాంటి వారికి 20 ఏళ్ల వయసులోనే వక్షోజాలు సడలిపోయి సమస్యలు వస్తాయి. అయితే ఈ మాత్రానికే కుంగిపోవాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న వ్యాయామాల ద్వారా వదులైన వక్షోజాలను బిగుతుగా చేసుకోవచ్చు.

వక్షోజాలు చిన్నవిగా ఉన్నంత మాత్రాన నిరాశలో కూరుకుపోవాల్సిన పనిలేదు. ఆత్మవిశ్వాసమే ఆకర్షణ అని గ్రహించాలి.

చాలామంది వక్షోజాల ఆకృతిని, పరిమాణాన్ని మార్చుకునేందుకు చికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. కొన్ని రకాల ఇంజెక్షన్లు వక్షోజాల సైజును పెంచేందుకు వాడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఉన్నప్పటికీ దుష్ఫలితాలూ ఉంటాయి.

వక్షోజాల పరిమాణాన్ని పెంచేందుకు ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ ఇంప్లాంట్స్ వంటివి అందుబాటులో ఉండనే ఉన్నాయి. ఇదంతా ఖరీదైన వ్యవహారం. అందరికీ అందుబాటులో ఉండదు.

Breast Cancer : రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను తెలుసుకోండి - NTV Telugu

అయితే కృత్రిమ పద్ధతుల్లో కాకుండా సహజంగానూ ఈ సైజులను పెంచుకోవచ్చు. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. కొవ్వు ఎక్కువగా ఉన్న నెయ్యి, నూనెలు వాడటం వల్ల వక్షోజాల సైజును పెంచుకోవచ్చు. శరీరంలో అదనంగా చేరే కొవ్వు వల్ల వక్షోజాల పరిమాణం మారుతాయి.

వక్షోజాలు చిన్నవిగా ఉండడానికి హార్మోన్ల లోపమే కారణం. మొదటి నుంచి వక్షోజాలు పెరగని వారికి కూడా హార్మోన్ల చికిత్స ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు పౌష్టికాహారం లేకపోయినా  వక్షోజాలు ఎదగవు, సరైన వయస్సుకు రజస్వల కాకపోవడం, అండాలు సరిగా విడుదల కాకపోయినా... వక్షోజాలు పెరగవు.

చిన్నచిన్న వ్యాయామాలు చేసినా....వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవచ్చు. అవి కూడా నిపుణుల సలహా మేరకు చేస్తే ఇంకా మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.