ఇవి తింటే స్వీట్లు తినాలనే కోరిక తగ్గుతుందట!

షుగర్.. ప్రస్తుతం ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ వస్తే ఏ వ్యక్తికైనా వదిలించుకోవటం చాలా కష్టం. తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించాలి.  రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ఆహారాలు తినకూడదు.

ఇవి తింటే స్వీట్లు తినాలనే కోరిక తగ్గుతుందట!


షుగర్.. ప్రస్తుతం ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ వస్తే ఏ వ్యక్తికైనా వదిలించుకోవటం చాలా కష్టం. తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించాలి.  రక్తంలో చక్కెర స్థాయిని పెంచే ఆహారాలు తినకూడదు. అయితే ఈ వ్యాధి ఉన్నవాళ్లలో స్వీట్లు తినాలనే కోరిక ఎక్కువ ఉంటుందట! మరి ఆ కోరికను ఎలా తగ్గించాలి? ప్రత్యామ్నయంగా ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి తెలుసుకుందాం..
How sweets offered in hygienic packs are revolutionising the packaged food  industry

తీపి తినాలని కోరికను తగ్గించే ఆహార పదార్థాలు ఏమిటంటే.. 

స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు..  ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల వంటి లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు చక్కెర కోరికలను తగ్గించడంలో సహాయపడతాయట.
బాదం, వాల్‌నట్, పిస్తా వంటి నట్స్‌లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు మంచిగా, పుష్కలంగా ఉంటాయి.  ఇవి కూడా చక్కెర కోరికలను తగ్గిస్తాయి.
అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. అలాగే తీపి, చక్కెర కోరికలను కూడా తగ్గిస్తుంది. 
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో  బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి ఉదయాన్నే తాగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదట.
బచ్చలికూరలో ఐరన్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదపడతాయి. అలాగే తీపి తినాలని ఆలోచనను తగ్గిస్తాయి.
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే చక్కెర, తీపి కోరికలు కలగకుండా చేస్తుంది. 
స్వీట్ పొటాటోలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బాగా ఉపయోగపడతాయి. షుగర్ ఉన్న వారు స్వీట్ పొటాటో తినకూడదనే బ్రమ ఉంటుంది కానీ ఇది నిజం కాదు.. 
యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు డార్క్ చాక్లెట్‌లో ఉంటాయి. ఇది స్వీట్లు తినాలనే కోరికను తీరుస్తుంది. అయితే వీటిని కొంత మొత్తంలో మాత్రమే తీసుకోవడం అవసరం.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.