కాకరకాయతో నిజంగానే షుగర్ కంట్రోల్ అవుతుందా?? పరిశోధనలు ఏం అంటున్నాయ్.?

రోజు మనం Bitter Gourd కాకరకాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. తింటే ఏ ఏ సమస్యలు తగ్గించుకోవచ్చో పూర్తిగా తెలుసుకుందాం. కొందరైనా మారి వారి డైట్ లో కాకరకాయను చేర్చుకోవాలనే మా ఈ ఆర్టికల్ ఉద్దేశం.

కాకరకాయతో నిజంగానే షుగర్ కంట్రోల్ అవుతుందా?? పరిశోధనలు ఏం అంటున్నాయ్.?


చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ చాలామందికి ఇష్టం లేని కూరగాయలో కాకరకాయ ముందు ఉంటుంది. కాకరకాయను ఇష్టపడే వాళ్లు చాలా అరుదు. నిజానికి కాకరకాయలో ఎన్నో మెడిసినల్ ప్రోపర్టీస్ ఉన్నాయి. కానీ ఈ కాకరకాయను ఇష్టపడని వాళ్లకు ఇది తినటం వల్ల వచ్చే లాభాలు తెలియకపోవడమే, అవగాహన లేకపోవడమే కానీ మొత్తానికి కాకరకాయను వాళ్ల జీవితం నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఈరోజు మనం కాకరకాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. తింటే ఏ ఏ సమస్యలు తగ్గించుకోవచ్చో పూర్తిగా తెలుసుకుందాం. 

కాకరకాయ చేదుగా ఉంటుంది అని చాలామంది తినరు కానీ కాకరకాయను చేదు లేకుండా కూడా టేస్టీగా చేసుకుని తినొచ్చు.

కాకరకాయలో ఉండే పోషకాలు

100 గ్రాముల కాకరకాయలో ఉండే పోషకాలు

  • 91 గ్రాముల నీటిశాతం ఉంటుంది.
  • పిండిపదార్థాలు 2.8 గ్రాములు
  • మాంసకృతులు 1.4 గ్రాములు
  • కొవ్వులు లేనట్లే
  • పీచుపదార్థాలు 4 గ్రాములు
  • ఫోలిక్ యాసిడ్ 67 మైక్రోగ్రాములు
  • శక్తి 20 కాలరీలు

ఇవి ముఖ్యంగా కాకరకకాయలో ఉండే పోషకాలు. కాకరకాయను షుగర్ ఉన్నవాళ్లు తింటే కంట్రోలో ఉంటుంది అని అంటరు.

అసలు షుగర్ కు కాకరకాయకు సంబంధం ఏంటి?

డయబెటీస్ ఉన్నవారికి కాకరకాయ తింటే తగ్గుతుంది అని సైంటిఫిక్ గా పరిశోధన చేసి మరీ చెప్పారు. వాళ్లు ఏం అంటున్నారు అంటే ?? కాకరకాయలో ఉండే ఫ్లైవనాయిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్ తో పాటు ఫ్రక్టోజామైన్ అనే కెమికల్ ఉంది. ఇది షుగర్ పేషెంట్స్ లో కణజాలంలో ఆహారపదార్థాలను ఎనర్జీగా మార్చే మైటాకాండ్రియన్ ఎక్కువగా చెక్కరను గ్రహించుకుని ఎక్కువగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటట్లు కాకరకాయ ప్రేరణ కలిగిస్తుంది.  

 

కాకరకాయ తిన్నప్పుడు ప్యాంక్రియాస్‌ గ్రంధిలో ఉండే బీటాకణజాలం స్టిమ్యులేట్ అయి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడెక్షన్ పెంచటానికి కాకరకాయ సపోర్ట్ చేస్తున్నది 2018వ సంవత్సరంలో మెక్సికో దేశం వారు పరిశోధన చేసి నిరూపించారు. కాకరకాయను వండుకుని డైలీ తినమంటే సాధ్యం కాకపోవచ్చు పొడిగా చేసుకుని అయినా డైలీ వాడుకోవచ్చు. 

ఇతర జబ్బులను నివారించే గుణం కాకరకాయకు ఉంటుందా?

క్యాన్సర్ మీద కూడా పరిశోధన చేశారు. కాకరకాయను వాడటం వల్ల ఇందులో ఉండే ఫైటోకెమికల్స్, ఫ్లైవనాయిడ్స్ వల్ల క్యాన్సర్ పేషెంట్ కి ఇవ్వడం వ్లల క్యాన్సర్ గ్రోత్ పెరగకుండా ఆగింది. మరికొంతమందిలో అయితే క్యాన్సర్ తగ్గటం కూడా జరిగిందని 2012వ సంవత్సరంలో థైవాన్ దేశం వారు పరిశోధన చేసి ఇచ్చారు. 

పొట్టుచుట్టు కొలత మగవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ పొట్టకొవ్వు కరిగించడానికి చాలారకాలుగా ప్రయత్నం చేస్తుంటారు కానీ..పెద్దగా ఉపయోగం ఉండదు. 2012వ సంవత్సరంలో నేషనల్ థైవనా యూనివర్శిటీ వారు ఒబిసిటీ ఉన్నవారి మీద పరిశోధన చేశారు. రోజుకు 8 గ్రాముల కాకరకాయపొడి పొద్దున, సాయంకాలం 8 గ్రాములు అట్లా రెండు నెలలు వాడేసరికి 1ఇంచ్ కొవ్వు కరిగిందని వాళ్లు కనుగొన్నారు. కాబట్టి ఎలాంటి వ్యాయామాలు చేయకుండా అయినా..డైలీ కాకరకాయ తింటుంటే..లాభం ఉంటుంది. పొడి చేసుకుని..భోజనంలో అది ఒక భాగం చేసుకోండి..ఈజీగా తినేయొచ్చు. 

యాంటిఆక్సిడెంట్ ప్రోపర్టీస్ చేదుగా ఉన్నవాటిలో ఎక్కువగా ఉంటాయి. యాంటివైరల్, యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ అన్నీ కాకరకాయలో చాలా ఉన్నాయి. 

కాబట్టి కాకరకాయను దూరం పెట్టిన వాళ్లు వారానికి ఒకసారైనా తినటం అలవాటు చేసుకోవడం మంచిది. షుగర్ పేషంట్స్ క్రమం తప్పకుండా కాకరకాయను పొడి లేదా, జ్యూస్ లేదా కూరగానైనా చేసుకుని తింటుంటే నెల రోజుల తర్వాతా టెస్ట్ చేసుకోండి. షుగర్ అదుపులోకి వచ్చేస్తుంది అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

Diabetes : డయాబెటీస్ డైట్ ప్లాన్

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.