రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని తినేస్తున్నారా.. అసలు విషయం తెలుసుకోకపోతే ముప్పే!

సాధారణంగా ఏ కాలంలోనైనా దొరికే ఆపిల్ పళ్ళలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి రోజు ఒక ఆపిల్ పండు తీసుకుంటే అసలు డాక్టర్ అవసరమే ఉండదని ఇప్పటికే చాలా ఏళ్లుగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇలా తినటం మంచిదే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఆపిల్ పండును తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది.

సాధారణంగా చల్లని ప్రదేశాల్లో దొరికే ఈ ఆపిల్స్ లో కేలరీలు, ఫైబర్, పిండి పదార్థాలు, విటమిన్ సి, కాపర్, పొటాషియం, విటమిన్ కె ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ బి1, విటమిన్ బి 6‌లు ఉంటాయి. ఈ పోషకాలని జీర్ణ క్రియ అని మెరుగు పరుస్తాయి అంతేకాకుండా బరువు తగ్గడానికి సైతం సహాయ పడతాయి గుండెని ఆరోగ్యాన్ని కాపాడతాయి.
కాగా ఆపిల్ పండులో ఉండే ఎన్నో పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేసిన ఆ విత్తనాలు మాత్రం విషం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇందులో సైనైడ్ ఉంటుంది. ఈ గింజల్ని తినటం వల్ల చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన సైనైడ్ మెదడుకు సంబంధించిన సమస్యలతో పాటు ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. తింటున్న ప్రతిసారి ఈ గింజలు తినేస్తూ ఉంటే స్లో పాయిజన్ గా శరీరాన్ని నాశనం చేస్తాయి. 
జ్యూస్ చేసే సమయంలో సైతం ఈ గింజల్ని తీసివేయడం మంచిది. ఇంకా చాలావరకు ఆపిల్ ను తినేటప్పుడు తొక్కతో పాటు తింటారు. అయితే ఈ తొక్క చాలా దళసరిగా ఉండటం వల్ల అరగకపోగా ఎన్నో రకాల సమస్యలకి దారితీస్తుంది. అలాగే దీన్ని తరచు తీసుకుంటే కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఆపిల్ పండును తినేటప్పుడు గింజలు తొక్క తీసినడం మంచిది. అంతేకాకుండా ఆపిల్ ని గుజ్జుగా చేసి తీసుకుని అలవాటు చాలామందికి ఉంటుంది. ఇలా తినేవారు వెంటనే తినేయటం మంచిది. నిల్వ ఉంచడం వల్ల ఫంగస్ అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.