బెల్లం ముక్కతో ఎన్ని అరోగ్య ప్రయోజనాలో..!

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో  ఎప్పుడు ముందు ఉంటుంది..  ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారిని Jaggery తరచూ తీసుకోమని చెప్తారు..  అయితే ఈ Jaggery  తీసుకోవడం వల్ల ఇంకా ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం...

బెల్లం ముక్కతో ఎన్ని అరోగ్య ప్రయోజనాలో..!
Health benefits with a piece of jaggery


 ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో  ఎప్పుడు ముందు ఉంటుంది..  ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారిని బెల్లం తరచూ తీసుకోమని చెప్తారు..  అయితే ఈ బెల్లం తీసుకోవడం వల్ల ఇంకా ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం...

బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేస్తుంది.. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని తీసుకుంటే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది.. అలాగే ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి. మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది.. అందుకే వీరు తరచూ బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తారు వైద్యులు.. 

అలాగే రోజు ఆహారం తినగానే ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకోవడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని తెలుస్తోంది..  అంతేకాకుండా బెల్లం మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది అంట అంతేకాకుండా తరచూ దీన్ని తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. 

మోకాళ్ళ నొప్పులకు బాధపడేవారు బెల్లాన్ని పరీక్ష తీసుకోవడం వల్ల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.. అలాగే గ్యాస్టిక్ సమస్యతో బాధపడేవారు రోజు ఉదయాన్నే పరగడుపున అల్లం బెల్లం సమపాలల్లో తీసుకొని తినటం వల్ల ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది..

అలాగే ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య తలనొప్పి ఇందులో మైగ్రేన్ చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అయితే బెల్లాన్ని నెయ్యని సమపాలల్లో తీసుకొని తినటం వల్ల మైగ్రేన్ అదుపులో ఉంటుందని తాజా అధ్యయనాల్లో బయటపడింది.. అంతేకాకుండా తరచూ ఆయాసంగా అనిపించినా కొంచెం దూరం నడిచేటప్పటికీ అలసిపోతున్న శరీరంలో ఐరన్ తక్కువైందేమో తెలుసుకోవాలి. ఇలాంటివారు ఐరన్ ఎక్కువగా ఉండే బెల్లం వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి అయితే ఎంచుకునే బెల్లం మాత్రం కచ్చితంగా మంచిదే తీసుకోవాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.