Food and Diet : ఎట్టి పరిస్థితుల్లో పరగ‌డుపునే ఇవి తినకండి.. అనవసరంగా అనారోగ్యం..! 

Food and diet : ఉదయాన్నే పెరుగు, పాలు వంటి ప‌దార్థాల‌ను ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ త‌యార‌వుతుంది. ఇది ఆయా ప‌దార్థాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బాక్టీరియాను చంపుతుంది.

Food and Diet : ఎట్టి పరిస్థితుల్లో పరగ‌డుపునే ఇవి తినకండి.. అనవసరంగా అనారోగ్యం..! 
Do not eat these with Empty stomach


Food and diet : ఉదయం లేచిన తర్వాత మీరు తినే Food మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పరగడపున తినేవి, తాగేవి మన బరువును నిర్ణయిస్తాయి.. ఉదయాన్నే Breakfast లో ఇప్పుడు చెప్పుకోబోయేవి మీరు పొరపాటున కూడా తినకండి. వీటిని తిన్నారంటే..మీ పని అయిపోయినట్లే..! ఇంతకీ ఏం తినకూడదంటే..

ఉదయాన్నే పెరుగు, పాలు వంటి ప‌దార్థాల‌ను ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ త‌యార‌వుతుంది. ఇది ఆయా ప‌దార్థాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బాక్టీరియాను చంపుతుంది. దీంతో అసిడిటీ వ‌స్తుంది. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను తీసుకోరాదు.
అర‌టి పండ్ల‌ను సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు. వీటిని తిన‌డం వ‌ల్ల ఆకలి తీరుతుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగు ప‌డుతుందంటారు.. అర‌టి పండ్ల‌లో మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని ప‌ర‌గ‌డుపునే తింటే శ‌రీరంలోని మెగ్నిషియం, పొటాషియం లెవ‌ల్స్‌పై ప్రభావం ప‌డుతుంది. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప‌ర‌గ‌డుపున అర‌టి పండ్ల‌ను కూడా తిన‌రాదు.
ట‌మాటాల్లో విట‌మిన్ సీ, ఇత‌ర పోష‌కాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని ప‌ర‌గ‌డున తింటే.. వీటిలో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణాశ‌యంలో అసిడిటీని పెంచుతుంది. దీంతో గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప‌ర‌గ‌డుపున వీటిని కూడా తిన‌రాదు.
నిమ్మ‌జాతికి చెందిన ఏ పండ్ల‌ను కూడా.. ప‌ర‌గ‌డుపున తిన‌రాదు. తింటే గుండెల్లో మంట‌, అసిడిటీ వ‌స్తాయి.  
కీర‌దోస‌లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. అందువల్ల వీటిని ప‌ర‌గ‌డుపున తింటే గ్యాస్‌, క‌డుపునొప్పి, గుండెల్లో మంట వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. క‌నుక వీటిని కూడా ప‌ర‌గ‌డుపున తీసుకోరాదు.
టీ, కాఫీల‌ను ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్, అజీర్ణం స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి వీటిని కూడా ప‌ర‌గ‌డుపున తీసుకోరాదు. అయితే చాలామందికి బెడ్ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. టీ, కాఫీలతోనే వారి రోజు మొదలవుతుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. మామూలుగానే టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంకా వీటిని పొద్దుపొద్దున్నే తాగితే అనేక సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..
వీటిని పరగడుపున తినే అలావాటు ఉంటే.. ఇకనైనా మానుకోండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.