అరటిపండుతో ఇలా డ్రింక్‌ చేసి తాగండి.. నెల రోజుల్లో బరువు తగ్గుతారు..!

అధిక బరువుతో నేడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం తేలికే.. కానీ దాన్ని తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టం.. చుక్కల కనిపిస్తాయ్‌.. జిమ్‌లోకి ఎంతో కష్టపడాలి, కఠినమైన డైట్‌ చేయాలి.. అప్పుడు కానీ ఈ కొవ్వు కరగదు.. అయితే.. ఇంత కష్టపడకుండా కూడా కొన్ని పద్ధతులు ద్వారా బరువు తగ్గొచ్చు.. మీరు మరీ అంత లావు లేకుండా.. ఉండాల్సన దాని కంటే

అరటిపండుతో ఇలా డ్రింక్‌ చేసి తాగండి.. నెల రోజుల్లో బరువు తగ్గుతారు..!


అధిక బరువుతో నేడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరగడం తేలికే.. కానీ దాన్ని తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టం.. చుక్కల కనిపిస్తాయ్‌.. జిమ్‌లోకి ఎంతో కష్టపడాలి, కఠినమైన డైట్‌ చేయాలి.. అప్పుడు కానీ ఈ కొవ్వు కరగదు.. అయితే.. ఇంత కష్టపడకుండా కూడా కొన్ని పద్ధతులు ద్వారా బరువు తగ్గొచ్చు.. మీరు మరీ అంత లావు లేకుండా.. ఉండాల్సన దాని కంటే.. 5-10 కేజీలు ఎక్కువగా ఉంటే.. ఇప్పుడే మేల్కొండి.. 
రోజుకు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఇన్ని లాభాలా??? - మన ఆరోగ్యం - Best  Health Info
రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కింద తెలిపిన విధంగా డ్రింక్‌ను త‌యారు చేసుకుని తాగితే అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా సుల‌భంగా క‌రిగిపోతుంది. మ‌రి ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలంటే..
ఒక అర‌టి పండు, ఒక నారింజ పండు, ఒక క్యారెట్‌.. మూడింటినీ తీసుకుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. అనంత‌రం వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. అందులో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగేయాలి. ఇలా ఈ డ్రింక్‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. ఈ మూడింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు కొవ్వును క‌రిగించ‌డంలో స‌హాయ ప‌డ‌తాయి. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. కొవ్వు కూడా క‌రుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శ‌రీరానికి పోష‌కాలు, శ‌క్తి ల‌భిస్తాయి. వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.
బరువు తగ్గే డ్రింక్స్‌ అంటే.. ఎప్పుడూ ధనియాలు, దాల్చినచెక్క, అల్లం, జిలకర్ర ఇలాంటివి వేసి చేస్తారు.. ఇవే తాగితే.. కడుపులో మంటగా ఉంటుంది.. పొట్ట తగ్గడం ఏమో కానీ.. ముందు వీటి మంట వల్ల ఇంకా బాధగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.. పైన చెప్పిన డ్రింక్‌లో మీకు మంటగా ఉండేవి ఏం ఉండవు.. అన్నీ టేస్టీగా ఉండేవే కాబట్టి.. హ్యాపీగా తాగొచ్చు.. ఇది తాగితే.. ఆకలి కూడా తక్కువగా వేస్తుంది. కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. దాంతో మీరు తక్కువగా తింటారు. ఇంకా ఇది స్కిన్‌కు కూడా చాలా మంచిది. !
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.