భుజాల నొప్పులు తగ్గటం లేదా.. తరచూ వేధించే ఈ సమస్యకు ఇదే పరిష్కారం!

ఈరోజుల్లో చాలామంది నొప్పులకు గురవుతూ వస్తున్నారు. ముఖ్యంగా పోషకాహారం తీసుకోకపోవడం శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక రకాల నొప్పులు దరి చేరుతున్నాయి అందులో ముఖ్యంగా మోకాళ్ల నొప్పి నడుం నొప్పి భుజాల నొప్పులు ఎక్కువగా వేధిస్తున్నాయి అయితే చాలాకాలం పాటు వేధించే ఈ భుజాలు నొప్పిని ఎలా తగ్గించుకోవాలంటే..

భుజాల నొప్పులు తగ్గటం లేదా.. తరచూ వేధించే ఈ సమస్యకు ఇదే పరిష్కారం!


ఈరోజుల్లో చాలామంది నొప్పులకు గురవుతూ వస్తున్నారు. ముఖ్యంగా పోషకాహారం తీసుకోకపోవడం శరీరానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక రకాల నొప్పులు దరి చేరుతున్నాయి అందులో ముఖ్యంగా మోకాళ్ల నొప్పి నడుం నొప్పి భుజాల నొప్పులు ఎక్కువగా వేధిస్తున్నాయి అయితే చాలాకాలం పాటు వేధించే ఈ భుజాలు నొప్పిని ఎలా తగ్గించుకోవాలంటే..
Hyderabad: Doctor Advice For Taking Precautions Shoulder Pain - Sakshi
నిజానికి మోకాళ్లలాగే, తుంటి, వెన్ను... ఇలా ఒంట్లోని ప్రతి కీలూ నొప్పికి గురయ్యే వీలుంటుంది. అలాగే భుజం కీళ్లు కూడా నొప్పికి గురవుతాయి. అలాంటప్పుడు మోకాళ్ల మార్పిడి మాదిరిగానే భుజాల్లోని కీళ్లను కూడా సరైన చికిత్స ఉంటుందని తెలుస్తోంది.

భుజాల నొప్పికి ప్రధాన కారణాలు ఏంటంటే..

వయసురీత్యా: పైబడే వయసు రీత్యా శరీరంలోని మిగతా కీళ్లు అరిగినట్టే భుజాల కీళ్లు కూడా అరిగిపోతాయి. ఇలా ఆస్టియో ఆర్థ్రయిటిస్‌ వల్ల భుజాల్లోని కీళ్లు అరిగిపోవడం పెద్దల్లో అత్యంత సహజం. ఈ కాలంలో ఈ సమస్య మధ్య వయసు వారిలో సైతం ఎక్కువగా కనిపిస్తుంది
కీళ్ల వాతం: కీళ్ల వాతం సమస్య ఉన్న వాళ్లలో శరీరంలోని పలు కీళ్లు అరిగిపోతూ ఉంటాయి. వాటిలో భుజం కీళ్లు కూడా ఉంటాయి. ఇది చిన్న వయస్కుల్లో (30 నుంచి 40 ఏళ్లు) కూడా ఉండవచ్చు.
కండరాల సమస్య: భుజాల్లో రొటేటర్‌ కప్‌ కండరాలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ డ్యామేజీని అశ్రద్ధ చేయడం వల్ల దీర్ఘకాలంలో భుజాల్లోని కీళ్లు అరిగిపోతాయి.
భుజం జారడం: కొందరికి భుజాల్లోని కీళ్లు పదే పదే జారుతూ ఉంటాయి. ఈ సమస్యను కొందరు సంవత్సరాల తరబడి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీని వల్ల కూడా భుజంలోని కీలు అరిగిపోయే అవకాశం ఉంటుంది

అయితే భుజాల దగ్గర నొప్పి ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే.. 

క్రమేపీ భుజంలో కదలికలు తగ్గిపోవడం.. జాయింట్‌ లోపల కరకరమనే శబ్దం.. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రాత్రుళ్లు కూడా నొప్పి వేధించడం.. భుజం అరుగుదలకు కారణం ఏదైనా చేసే చికిత్స ఒకే విధంగా ఉంటుంది.

ఈ నొప్పిని ఎలా అదుపు చేయాలంటే..

భుజం నొప్పి ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు, కొన్ని రకాల వ్యాయామాలు, తీవ్రతను బట్టి కొన్ని రకాల ఇంజెక్షన్లు తీసుకోవడం ద్వారా నొప్పిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. 
ఈ దశను దాటి నొప్పి తీవ్రంగా ఉన్న సందర్భాల్లో ‘ఆర్థ్రోస్కోపీ’ ద్వారా కణజాలాన్ని వదులు చేసి, కదలికలను పెంచే వీలుంటుంది. దాంతో నొప్పి కూడా తగ్గుతుంది. 
మూడవ దశలో తప్పనిసరిగా షోల్డర్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌’ చేయవలసి ఉంటుంది. మోకాలి మార్పిడి సర్జరీ ఎలా చేస్తారో, షోల్డర్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ కూడా అలాగే చేస్తారు. వీటిలో కూడా కోబాల్ట్‌, క్రోమియం, టైటానియం కృత్రిమ కీళ్లను ఉపయోగిస్తారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.