Weight loss with cabbage : అర్రే.. పొట్ట దగ్గరి కొవ్వు ఇబ్బంది పెడుతుందా.. క్యాబేజీతో కతమ్‌ చేసేయండి..!!

Cabbage ని soups కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంట్లో ఉండే సమ్మేళనాలు మన శరీరంలోని కొవ్వును కరిగించేస్తాయి. దీంతో over weight తగ్గుతారు. క్యాబేజీతో సూప్‌ తయారు చేసుకుని రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా మధ్యాహ్నం లంచ్‌ సమయంలో తాగాలి.

Weight loss with cabbage : అర్రే.. పొట్ట దగ్గరి కొవ్వు ఇబ్బంది పెడుతుందా.. క్యాబేజీతో కతమ్‌ చేసేయండి..!!
Reduce fat near stomach with cabbage


Over weight.. అసలు ఇది మనిషి జీవితాన్ని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తుంది. కోరికలను కంట్రోల్‌ చేసుకోలేక ఏదో ఒక ముద్ద ఎక్కువ తింటాం.. అంతే.. ఆ మాత్రానికి బరువు పెరిగిపోవాలా..? బరువు సంగతి అటుంచి..ఈ పొట్ట ఒకటి.. పొట్ట ఎక్కువగా ఉంటే.. అస్సలు మనం మనకే నచ్చం.. ఏ డ్రస్‌ వేసుకుందాం అన్నా.. పొట్టే కనిపిస్తుంది. బరువు తగ్గాలంటే.. కఠినమైన వ్యాయామాలు చేయాలి, పరిగెత్తాలి, వంగాలి, లేవాలి అంటే మనతోని కాదు అనుకునే బ్యాచా మీరు.. అయితే మీకోసమే ఈ టిప్.. మనకు అందుబాటులో ఉండే క్యాబేజీతోనూ అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలంటే..
క్యాబేజీని సూప్‌ల కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంట్లో ఉండే సమ్మేళనాలు మన శరీరంలోని కొవ్వును కరిగించేస్తాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. క్యాబేజీతో సూప్‌ తయారు చేసుకుని రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా మధ్యాహ్నం లంచ్‌ సమయంలో తాగాలి. దీంతో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు.

క్యాబేజీ సూప్‌ను ఇలా చేయండి..

ఒక క్యాబేజీని తీసుకుని సన్నగా తరగాలి. రెండు క్యారెట్‌లను తీసుకుని సన్నగా ముక్కలుగా కట్‌ చేయాలి. రెండు ఉల్లిపాయలను కూడా అలాగే కట్‌ చేయాలి. అర టీస్పూన్‌ కార్న్‌ ఫ్లోర్‌, ఒక టీస్పూన్‌ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్‌ వెన్న తీసుకోవాలి.
తరిగి పెట్టుకున్న కూరగాయలు అన్నింటినీ కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి బాగా ఉడికించాలి. రెండు లేదా మూడు విజిల్స్‌ వచ్చే వరకు కూరగాయలను ఉడకబెట్టాలి. అనంతరం ఒక పాన్‌లో వెన్న వేసి అందులో ముందుగా ఉడకబెట్టుకున్న కూరగాయలను వేయాలి. అందులో కుక్కర్‌లో ఉండే నీరు కూడా పోయాలి. తరువాత మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి.. సూప్‌ చిక్కగా రావడం కోసం కొద్దిగా కార్న్‌ ఫ్లోర్‌ను వేసి ఉండలుగా కాకుండా కలపాలి. దీంతో క్యాబేజీ సూప్‌ రెడీ అవుతుంది.
ఇలా తయారు చేసుకున్న క్యాబేజీ సూప్‌ను తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. అలాగే దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఈ టిప్‌ పాటించి..బరువు తగ్గేయండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.