కిస్సింగ్‌ డిసీస్‌.. ముద్దుపెట్టుకునే ముందు కాస్త ఆలోచించండి..!

ముద్దుపెట్టుకుంటే కాలరీలు ఖర్చు అవుతాయి, స్ట్రస్‌ రిలీఫ్‌ అవుతుంది. మనసుకు చాలా బాగుంటుందని మనం ఇప్పటి వరకూ విన్నాం.. అసలు ముద్దంటే వద్దనే ప్రేమ జంట ఉంటుందా.. కానీ మీరు ఈరోజు ముద్దుల వ్యాధి గురించి తెలుసుకోవాలి.. ఇక నుంచి ముద్దంటే ఆలోచించాల్సిందే.  

కిస్సింగ్‌ డిసీస్‌.. ముద్దుపెట్టుకునే ముందు కాస్త ఆలోచించండి..!


ముద్దుపెట్టుకుంటే కాలరీలు ఖర్చు అవుతాయి, స్ట్రస్‌ రిలీఫ్‌ అవుతుంది. మనసుకు చాలా బాగుంటుందని మనం ఇప్పటి వరకూ విన్నాం.. అసలు ముద్దంటే వద్దనే ప్రేమ జంట ఉంటుందా.. కానీ మీరు ఈరోజు ముద్దుల వ్యాధి గురించి తెలుసుకోవాలి.. ఇక నుంచి ముద్దంటే ఆలోచించాల్సిందే.  
A deep kiss or a peck on the forehead? 15 different types of kisses and  what they really mean | Life
ముద్దు వ్యాధి(కిస్సింగ్ డిసీజ్). ఇప్పటి వరకు ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలాంటి వ్యాధి ఒకటి ఉందని కూడా వినకపోవచ్చు. అవును, కిస్సింగ్ వ్యాధి ముద్దు వల్ల వస్తుంది. మీ భాగస్వామిని ముద్దుపెట్టుకునే ముందు మీరు ఆలోచించాలి. ముద్దు పెట్టుకోవడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు ముద్దు వల్ల కలిగే వ్యాధికి మందు కూడా లేదని చెబుతున్నారు. కాబట్టి కిస్సింగ్ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు ముద్దులు ఆపేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వ్యాధిని ఇప్పుడు మోనోన్యూక్లియోసిస్‌(Mononucleosis Disease)గా పిలుస్తున్నారు.
ఈ వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వైరస్ పేరు ఎప్స్టీన్ బారే వైరస్. ఇది హెర్పెస్ వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ ఎలాంటి లక్షణాలు లేకుండానే రోగి శరీరంలో వ్యాపిస్తుంది. లాలాజలం, నీరు, రసం లేదా పంచుకునే పాత్రల ద్వారా వ్యాపిస్తుంది. ఒక రోగిలో వైరస్ చురుకుగా మారినప్పుడు అది మరొక వ్యక్తికి సోకుతుంది. ఇది రక్తం లేదా వీర్యంతో పరిచయం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది. 

లక్షణాలు..

ఈ కిస్సింగ్ డిసీజ్‌ వల్ల వచ్చే వ్యాధులు విపరీతమైన అలసట, జ్వరం, గొంతు నొప్పి, తల , ఒళ్లు నొప్పులు, మెడ మరియు చంకలలో శోషరస గ్రంథులు వాపు, కాలేయం లేదా ప్లీహము వాపు, దద్దుర్లు వంటివి వస్తాయి. ఈ వ్యాధిని గుర్తించడానికి రక్త పరీక్ష, యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. ఈ వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి స్వీయ జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక పరిష్కారమని నిపుణుల సూచిస్తున్నారు. మీకు జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోవడం మానుకోండి

కిస్సింగ్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం. కాబట్టి.. హైడ్రేటెడ్ గా ఉండడం, విశ్రాంతి తీసుకోవడం మరియు నొప్పి మరియు జ్వరాన్ని తగ్గించడానికి మందులు మరియు కషాయాలను త్రాగడం చాలా ముఖ్యం.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.