ఎక్కువ కాలం పాటు శృంగారంలో పాల్గొనకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? 

మనిషి అన్నాక అన్ని కళ్లలో కాసింత అనుభవం ఉండాలని మన పెద్దోళ్లు అంటుంటారు. కామం కూడా మనిషికి చాలా ముఖ్యమైన కళ. ఇది లోపిస్తే వారు ఒత్తిడిని, మానసికంగా, శారీరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఒక కరెక్టు పర్సన్‌తో రొమాన్స్‌

ఎక్కువ కాలం పాటు శృంగారంలో పాల్గొనకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? 


మనిషి అన్నాక అన్ని కళ్లలో కాసింత అనుభవం ఉండాలని మన పెద్దోళ్లు అంటుంటారు. కామం కూడా మనిషికి చాలా ముఖ్యమైన కళ. ఇది లోపిస్తే వారు ఒత్తిడిని, మానసికంగా, శారీరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఒక కరెక్టు పర్సన్‌తో రొమాన్స్‌లో పాల్గొన్నప్పుడు మీ ముందు ఉన్న సమస్యలన్నీ చాలా చిన్నవిగా అనపిస్తాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. తెలియని ఆనందం ఇలా చాలా ఉంటాయి. అయితే పెళ్లి లేటవ్వడం వల్లనే, లేక పెళ్లైనా కూడా కొన్ని కారణాల వల్ల చాలా కాలం పాటు శృంగారంలో పాల్గొనకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.!
HD wallpaper: red rose, couple, romance, love, roses, hugs, women, couple -  Relationship | Wallpaper Flare
శృంగారం చేయకపోవడం వల్ల శరీరం, మొత్తం ఆరోగ్యం పైనే నెగెటీవ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. భావోద్వేగ స్థాయిలో వ్యక్తులు రొమాన్స్ చేయడం మానేసినప్పుడు ఒంటరితనం, మానసిక క్షోభ వంటి అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు.
రొమాన్స్ లేకపోవడం వల్ల తక్షణ శారీరక మార్పు లైంగిక కోరికలు తగ్గుదలకు కారణమవుతుంది. రెగ్యులర్ లైంగిక కార్యకలాపాలు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల విడుదలని ప్రేరేపిస్తాయి. శరీరంలో ఇవి ప్రేరేపణ, కోరికను కొనసాగించడంలో కీ రోల్ ప్లే చేస్తాయి.
రెగ్యులర్‌గా కలయిక లేకపోతే హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇది లైంగిక కోరికలను తగ్గేలా చేస్తుంది. ఈ కారణంగా లైంగిక చర్యలో పాల్గొనకపోవడం లైంగిక ప్రేరణకు శరీర శారీరక ప్రతిస్పందనని ప్రభావితం చేస్తుంది.
 
శరీరం లైంగిక స్పర్శ లేకుండా సున్నితంగా మారతుంది. జననేంద్రియ కణజాలం తక్కువ రక్త ప్రవాహాన్ని, స్థితిస్థాపకతను అనుభవించొచ్చు. ఇది లైంగిక ప్రేరేపణ, ప్రతిస్పందనతో సమస్యల్ని కలిగిస్తుంది. ఇది లైంగిక సమస్యలకు దారితీస్తుంది.
 
వ్యక్తులు రొమాన్స్ చేయలేకపోవడం వల్ల పెల్విక్ ఫ్లోర్ ప్రాంతంలో కండరాల బలహీనత ఎదురవుతుంది. రెగ్యులర్ లైంగిక చర్య ఈ కండరాలను నిమగ్నం చేయడానికి, బలంగా చేయడానికి సాయపడుతుంది. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మొత్తం మీ శరీరానికి అరికాలి నుంచి తల వరకూ బ్లడ్‌ సర్క్యూలేషన్‌ ఉరకలేస్తుంది. అందుకే ఆ టైమ్‌లో శరీరం కాస్త వేడిగా మారుతుంది. అంత స్పీడ్‌గా రక్తప్రసరణ అవ్వాలంటే మీరు ఎన్నో వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది సింపుల్‌గా సుఖపడుతూ సెక్స్‌ చేయడం వల్ల మీ అటు ఆనందాన్ని ఇటు ఆరోగ్యాన్ని సెట్‌ చేసుకోవచ్చు.
 
రొమాన్స్ చేయడం వల్ల కలిగే ప్రభావం వ్యక్తికి వ్యక్తి మారుతుంది. వయస్సు, మొత్తం ఆరోగ్యం, సంబంధాల స్థితి, వ్యక్తిగత ప్రాధాన్యతలు వంటి అంశాల ఆధారంగా ప్రభావాలు మారుతుంటాయి. సెక్స్‌ అనేది ఏమాత్రం తప్పు కాదు. ఒకవేళ అది తప్పు అయితే మన పుట్టుక మాత్రం గొప్పది ఎలా అవుతుంది. కాకపోతే ఇరువురి అంగీకారంతోనే రతిలో పాల్గొనాలి. బలవంతగా చేస్తే కంపరంగా ఉంటుంది. అది ఎలాంటి సంతృప్తిని ఇవ్వదు.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.