Vitamin -D : విటమిన్ డి లోపమా? ఎండలో తిరగే సమయం లేకపోతే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి చాలు..

మారిపోతున్న జీవన శైలితో పాటు ఆరోగ్యం అలవాట్లు కూడా మారిపోతున్నాయి ఈ హడావిడి జీవితంలో పడి ఆరోగ్యాన్ని ఏమాత్రం ఆ జాగ్రత్త చేసిన పెను ప్రమాదం తప్పదు.. శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్స్ అందించకపోతే కచ్చితంగా నీరసం పడే అవకాశాలు ఉంటాయి..అలాగే శరీరానికి Vitamin D ఎంతో అవసరం.

Vitamin -D  :  విటమిన్ డి లోపమా? ఎండలో తిరగే సమయం లేకపోతే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి చాలు..
Vitamin D food


మారిపోతున్న జీవన శైలితో పాటు ఆరోగ్యం అలవాట్లు కూడా మారిపోతున్నాయి ఈ హడావిడి జీవితంలో పడి ఆరోగ్యాన్ని ఏమాత్రం ఆ జాగ్రత్త చేసిన పెను ప్రమాదం తప్పదు.. శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్స్ అందించకపోతే కచ్చితంగా నీరసం పడే అవకాశాలు ఉంటాయి.. అలాగే శరీరానికి Vitamin D  ఎంతో అవసరం..  అయితే రోజు కాసేపు ఎండలో తిరగటం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుందని తెలిసిన ఆ మాత్రం సమయం కూడా లేక ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.. అయితే దీనివల్ల దీర్ఘకాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.. 

ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాత్రి షిఫ్టులతో ఉదయాన్నే లేచి ఎండలో నడిచే వాళ్ళు ఎంతమంది అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలింది.. అలాగే తగిన రీతిలో ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు అరుదైపోతున్నారు.. అయితే శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి..  చిన్న వయసులోనే ఎముకలు బలహీన పడతాయి..  అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించడంలో విటమిన్ డి ప్రముఖ పాత్ర వహిస్తుంది. అయితే ఎండలో నడిచే సమయం లేని వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు.. 

పుట్టగొడుగులను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది.. అలాగే వెన్న తీయని ఒక గ్లాస్ పాలను రోజు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి కొంతవరకు అందుతుంది.. ఫ్యాట్ అనే కారణంతో గుడ్డులో ఉండే పచ్చసోను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు అయితే ఇందులో విటమిన్ డి తో పాటు ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి.. అంతేకాకుండా గోధుమ రోటీలకు బదులు రాగి రోటీలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి అందుతుంది.. కాడ్ లివర్ ఆయిల్ లో కూడా ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.. వంటల్లో ఆవాలు పసుపును ఎక్కువగా ఉపయోగించాలి.. రోజు డార్క్ చాక్లెట్ ను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ ఈ లోపాన్ని అధిగమించవచ్చు.. కమల పండ్లలో విటమిన్ సి, డి కూడా అధికంగా ఉంటాయి.. అంతేకాకుండా ఇవి శరీరానికి చర్మానికి ఎంతో నిగారింపని ఇస్తాయి..   తరచూ చేపలతో పాటూ వీటన్నిటినీ కూడా ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కావాల్సిన డి విటమిన్ మీద అందుతుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.