అధిక రక్త పోటు కు కారణమయ్యే ఆహార పదార్థాలు ఇవే..

ఆరోగ్య సమస్యల్లో అధిక రక్త పోటు కూడా ఒకటి అయితే ఈ వ్యాధి వలన గుండెపోటు మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అలాగే

అధిక రక్త పోటు కు కారణమయ్యే ఆహార పదార్థాలు ఇవే..
High blood pressure


ఈరోజుల్లో ప్రతి ఒక్కరినే వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో High blood pressure కూడా ఒకటి అయితే ఈ వ్యాధి వలన గుండెపోటు మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అలాగే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి.. అవి ఏంటంటే.. 

రక్తపోటు సమస్యతో బాధపడేవారు వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు వీటిలో అధిక మొత్తంలో సోడియం ఉండటం వలన రక్తపోటు సమస్యను మరింత పెంచుతుంది అలాగే సోడియం వలన సిరల పనితీరు తగ్గిపోవడం మొదలయ్యి తర్వాత రక్త పోటు తీవ్రస్థాయికి చేరుతుంది.. 

అలాగే ప్రాసెస్ చేసిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంచటం వలన హానికర మసాలాలు కలిపి ఉంటాయి ఇవి రక్తం పాటు స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర వహించడం వలన వీటికి దూరంగా ఉండటం అవసరం.. 

అలాగే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు నిల్వ ఉంచిన ఊరగాయ పచ్చడ్లలో ఉప్పు నూనె ఎక్కువగా ఉంటుంది దీని వలన సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటం వల్ల వీటికి దూరంగా ఉండాలి.. 

అలాగే కాఫీలో ఉండే కెఫెన్ వలన రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది అందుకే రక్త పోటు సమస్య తో బాధపడేవారు టీ కాఫీలకు దూరంగా ఉండాలి.. అలాగే అధిక మసాలాలు మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్యను అదుపులో ఉంచుకొని ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.