diet plan : సంవత్సరంలో 12 మాసాలు కదా.. ఏ మాసంలో ఏ ఆహారం తీసుకోవాలో తెలుసా!

Diet plan for Year: సాధారణంగా ఒక ఏడాదిలో 12 మాసాలు ఉంటాయి. అయితే ప్రతి మాసం ప్రత్యేకమైనే చెప్పాలి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు బట్టి ఈ మాసాలని నిర్ణయించారు. అందుకే ఆ కాలంలో విరివిరిగా దొరికే పండ్లను, ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని తెలుస్తోంది.

diet  plan : సంవత్సరంలో 12 మాసాలు కదా.. ఏ మాసంలో ఏ ఆహారం తీసుకోవాలో తెలుసా!
Diet plan


సాధారణంగా ఒక ఏడాదిలో 12 మాసాలు ఉంటాయి. అయితే ప్రతి మాసం ప్రత్యేకమైనే చెప్పాలి.
ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు బట్టి ఈ మాసాలని నిర్ణయించారు. అందుకే ఆ కాలంలో విరివిరిగా దొరికే పండ్లను, ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని తెలుస్తోంది.

మన గ్రంధాలు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు సూచిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆయుర్వేదం సంవత్సరంలో ఉండే 12 మాసాల్లో తీసుకునే ఆహార నియమాలని చెబుతుంది.

మాఘ ఫాల్గుణ మాసాలు జనవరి మధ్యలో మొదలై మార్చి వరకు ఉంటాయి. ఈ మాసాన్నే శిశిర ఋతువు అని కూడా అంటారు. ఈ కాలంలో చలి తగ్గి వేడి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో గోధుమలు, కొత్త బియ్యం తీసుకోవడం మంచిది. అలాగే సొరకాయ, బెండకాయ, బీరకాయ, క్యాబేజీ, టమోటా వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. గుమ్మడికాయ, తోటకూర వంటి వాటిని పప్పుతో కలిపి తీసుకోవడం మంచిది. పెసరపప్పు, మినప్పప్పు వంటి వాటిని తీసుకోవటం మంచిదే. మాంసాహారులైతే అన్ని రకాల మాంసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, దుంప కూరలు ఈ కాలంలో తినటం మంచిది. అలాగే పెరుగు, నెయ్యి, మజ్జిగ వంటి పాల పదార్థాలను తీసుకోవచ్చు. కాకరకాయ, ములక్కాయ వంకాయ వంటి వాటిని ఈ కాలంలో ఎక్కువగా తీసుకోరు. అలాగే చల్లని నీళ్లు, పనసపండు వంటి వాటిని కూడా తీసుకోకూడదు.

చైత్ర వైశాఖ మాసాలు మార్చి మే నెలలో వస్తూ ఉంటాయి. దీనిని వసంత రుతువు అని కూడా అంటారు. ఈ కాలంలో సెనగపప్పు, బఠాణి, పెసరపప్పు వంటివి తీసుకోవడం మంచిది. అలాగే మాంసాహారులు చికెన్, మటన్, చేపలు వంటి వాటిని తీసుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్యారెట్, ముల్లంగి కూడా తీసుకోవడం మంచిదే.

జేస్ట ఆషాడ మాషాలు మే నుండి జూలై వరకు వస్తూ ఉంటాయి. ఈ కాలంనే గ్రీష్మ రుతువు అంటారు. ఈ క్రమంలో ఎండ నెమ్మదిగా తగ్గి వర్షాలు మొదలయ్యే కాలం. ఈ సమయాల్లో అన్ని రకాల కాయగూరలు సొరకాయ, దొండకాయ, కాలిఫ్లవర్, దోసకాయ వంటి వాటిని తీసుకోవచ్చు. అలాగే బీట్రూట్, చామదుంప, అరటికాయ, మామిడి పళ్ళు, ద్రాక్ష, ఖర్జూరం వంటి వాటిని తీసుకోవచ్చు. అలాగే పాల సంబంధిత పదార్థాలను సైతం తీసుకోవడం మంచిది.

శ్రావణ భాద్రపధ మాసాలు జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటాయి. వీటినే వర్షఋతువు అని కూడా అంటారు. ఈ కాలంలో చిరుజల్లులు పడే అవకాశం ఉండటంతో జీర్ణశక్తి తగ్గుతూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో గోధుమలు, రాగులు వంటి వాటిని తీసుకోవచ్చు. వంకాయ, దొండకాయ, పెసరపప్పు, మినపప్పు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా నెయ్యి, ఉల్లి వాటిని తీసుకోవాలి.

అశ్వయుజ కార్తీక మాసాలు సెప్టెంబర్ నవంబర్ నెలలో వస్తూ ఉంటాయి. ఈ కాలాన్ని శరదృతువు అంటారు. ఈ సమయంలో అన్నం, రాగులు, రాగి అంబలి వంటివి తీసుకోవడం మంచిది. అలాగే పాలకూర, కొత్తిమీర, మెంతుకూర వంటి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. అల్లం, జీలకర్రతో చేసిన ఆహార పదార్థాలు దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవడం మంచిది.

మార్గశిర పుష్య మాసాలు నవంబర్ నుండి జనవరి వరకు వస్తూ ఉంటాయి. ఈ కాలాన్ని హేమంత రుతువు అంటారు. ఈ సమయంలో జీర్ణశక్తి లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో గోధుమ రొట్టెలు, సొరకాయ, బెండకాయ వంటి వాటిని తీసుకోవడం మంచిది. కంద, చామ, క్యారెట్ వంటివి ఈ కాలంలో విరివిరిగా దొరుకుతాయి. వీటన్నిటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే పనసకాయ, వంకాయ, ఎండుకారం వంటి వాటిని ఈ కాలంలో ఎక్కువగా తీసుకోకూడదు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.