Quail Eggs : కోడిగుడ్డు కంటే పవర్‌ఫుల్‌ కౌజుపిట్ట గుడ్డు.. తిన్నారంటే రోగాలన్ని ఫట్..!

కోడిగుడ్డు, Quail Eggs గురించి చాలామంది వినే ఉంటారు.. కానీ Quail Eggs గురించి మీకు తెలుసా.. కౌజు పిట్ట మాంసం ఉంటుంది.. అబ్బో ఆ టేస్టే వేరు.. ఊర్లల్లో ఉండేవాళ్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు తినే ఉంటారు.

Quail Eggs  : కోడిగుడ్డు కంటే పవర్‌ఫుల్‌ కౌజుపిట్ట గుడ్డు.. తిన్నారంటే రోగాలన్ని ఫట్..!
Quail egg


కోడిగుడ్డు, Quail Eggs గురించి చాలామంది వినే ఉంటారు.. కానీ Quail Eggs గురించి మీకు తెలుసా.. కౌజు పిట్ట మాంసం ఉంటుంది.. అబ్బో ఆ టేస్టే వేరు.. ఊర్లల్లో ఉండేవాళ్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు తినే ఉంటారు. కౌజుపిట్ట గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కోడిగుడ్డు ఏం సరిపోతుంది అసలు..కౌజుపిట్ట గుడ్డు ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దామా.. మీకు అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు.

కౌజుపిట్ట గుడ్ల ప్రయోజనాల

  •  కౌజుపిట్ట గుడ్డు లో అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. 
  • శ‌రీరంలో యాంటీ బాడీలు అధికంగా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. దీంతో వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటారు.
  • కౌజుపిట్ట గుడ్డులో డీహెచ్ఏ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా కాపాడతాయి
  • ఈ పిట్ట‌ల గుడ్లలో ఉండే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతాయి
  • కౌజుపిట్ట గుడ్డు గుడ్ల‌లో బి విట‌మిన్‌ అధికంగా ఉంటుంది.. అందువ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు త్వర‌గా ఖ‌ర్చ‌వుతాయి. శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు.
  • చిన్నారుల‌కు ఈ గుడ్ల‌ను తినిపించ‌డం వ‌ల్ల వారిలో పెరుగుద‌ల, శ‌రీర నిర్మాణం స‌రిగ్గా ఉంటుంది. అన్ని అవ‌య‌వాలు చక్కగా ప‌నిచేస్తాయి.
  • ఈ పిట్ట‌ల గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని భార లోహాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ గుడ్డు మీకు దొరికితే మాత్రం కచ్చితంగా తీసుకోని తినండి. ఇప్పుడు మార్కెట్లలో అన్ని అందుబాటులో ఉంటున్నాయి.. కాబట్టి దొరకవు అనే బాధ ఉండదు.
కౌజుపిట్ట గుడ్డు గుడ్ల‌లో ఉండే ప్రోటీన్లు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నిత‌నాన్ని పెంచుతాయి. దీని వ‌ల్ల మెద‌డు క‌ణాలు దెబ్బ తిన‌కుండా ఉంటాయి.
కౌజుపిట్ట గుడ్డు గుడ్ల‌లో లుసిన్ అన‌బ‌డే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రిస్తుంది. దీని వ‌ల్ల ఇన్సులిన్‌ను శ‌రీరం సరిగ్గా గ్ర‌హిస్తుంది. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.