ఎరుపు రంగు ఆహారాలతో ఆయుష్షు పెంచుకోవచ్చు..!

ఎరుపు రంగు ఉండే ఆహారాలు కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. Red color పండ్లు, కూరగాయలు ఏవైనా సరే..! ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను తిన‌డం వల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు ఆహారాలతో ఆయుష్షు పెంచుకోవచ్చు..!
Red colored food can increase life span


ఆహారాల కలర్‌ను బట్టి అవి మనకు ఎంత మేలు చేస్తాయో చెప్పేయొచ్చు తెలుసా.. ఆకుపచ్చ రంగులో ఉండేవి, పసుపు రంగులో ఉండేవి ఆరోగ్యానికి చాలా మంచిది. వాటితోపాటు Red color food కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు ఏవైనా సరే..! ఎరుపు రంగులో ఉండే ఆహారాల‌ను తిన‌డం వల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు ఆహారాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌. యాంటీ క్యాన్స‌ర్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి.
ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూర‌గాయ‌ల్లో విట‌మిన్లు సీ, ఏ లు అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు, ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మం, వెంట్రుక‌లు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
ఎరుపు రంగు ప‌దార్థాల్లో ఎల‌క్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మ‌న శరీర విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డానికి స‌హాయ ప‌డ‌తాయి. ఈ ప‌దార్థాల్లో పొటాషియం, సోడియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవి హైబీపీని త‌గ్గిస్తాయి.
ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూర‌గాయ‌ల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్లే అవి ఆ రంగులో కనిపిస్తాయి. అలాగే వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోస‌య‌నిన్స్ అధికంగా ఉంటాయి. అవి యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.
ఎరుపు రంగు ఆహారాల్లో ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల‌లా ప‌నిచేస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. ఇంకా వీటిల్లో క్వ‌ర్సెటిన్ అనే ఫ్లేవ‌నాయిడ్ ఉంటుంది. ఇది ఆస్త‌మాను త‌గ్గిస్తుంది.
మ‌న శ‌రీరంలో ర‌క్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగులో ఉండే ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల రక్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎరుపు రంగు ఆహారాల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. మీరు కూడా వీటిని తినండి. ఇంతకి ఎరుపు రంగు ఆహారాలు ఏవంటారా.. ట‌మాటాలు, చెర్రీలు, యాపిల్స్, రెడ్‌ క్యాప్సికమ్‌, స్ట్రాబెర్రీలు, దానిమ్మ‌, ప్ల‌మ్స్‌, పండు మిర‌ప‌కాయ‌లు, రెడ్ బీన్స్, పుచ్చ‌కాయ‌లు, ఎరుపు రంగు క్యాబేజీ, వంటివి ఎరుపు రంగులో ఉండే ఆహారాలు..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.