సంతాన లోపం సమస్యా... ఈ ఆహారాలను తినండి..! 

ఇండియాలో సంతాన లోపం సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. వీటికి కారణాలు అనేకం ఉంటున్నాయి.. భార్య భర్త ఇద్దరిలో లోపాలు ఉంటున్నాయి.. కొందరికి ఆలస్యంగా పిల్లలు కులుగుతుంటే మరికొందరి అసలు సంతానం అనేది కలగానే మిగిలిపోతుంది.

సంతాన లోపం సమస్యా... ఈ ఆహారాలను తినండి..! 


ఇండియాలో సంతాన లోపం సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. వీటికి కారణాలు అనేకం ఉంటున్నాయి.. భార్య భర్త ఇద్దరిలో లోపాలు ఉంటున్నాయి.. కొందరికి ఆలస్యంగా పిల్లలు కులుగుతుంటే మరికొందరి అసలు సంతానం అనేది కలగానే మిగిలిపోతుంది. సమస్య ఉందని తెలిస్తే.. ముందు మందులు వాడటం కంటే.. తిండి మీద శ్రద్ధ పెట్టాలి. కొన్ని ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల సంతానం క‌లిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే..

శ‌న‌గ‌ల‌ను ఉడ‌క‌బెట్టి కానీ, కూర‌ల్లో గానీ వేసుకుని నిత్యం తింటుంటే మ‌హిళ‌ల్లో అండాశ‌యాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీని వల్ల నెల‌స‌రి స‌రిగ్గా అవుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.

దానిమ్మ పండ్ల‌లో స్త్రీ, పురుష ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ పని తీరుకు అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యానికి ర‌క్తం స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. దీంతో రుతుక్ర‌మం స‌రిగ్గా జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి. 

దానిమ్మ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. పురుషుల్లో ఉండే స‌మ‌స్య‌లు కూడా పోతాయి. దీని వ‌ల్ల సంతానాన్ని త్వ‌ర‌గా పొంద‌వ‌చ్చు.

ఆకుప‌చ్చ‌గా ఉండే కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల అనేక‌ పోష‌కాలు ల‌భిస్తాయి. ఆ పోష‌కాలు స్త్రీ, పురుషుల్లో ఉండే హార్మోన్ అస‌మ‌తుల్య‌త‌ల‌ను త‌గ్గిస్తాయి. మ‌హిళ‌ల్లో ఫోలిక్ యాసిడ్‌, ఐర‌న్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. దీంతో గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.  

ఆలివ్ ఆయిల్‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దంప‌తులు నిత్యం త‌మ ఆహారంలో ఆలివ్ ఆయిల్‌ను తీసుకుంటే దాంతో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీని వ‌ల్ల శృంగార స‌మ‌స్య‌లు ఉండ‌వు. సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.

గుమ్మ‌డి కాయ విత్త‌నాల‌ను తింటుంటే ఐర‌న్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీంతో ర‌క్తం పెరుగుతుంది. శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు. సంతానం త్వ‌ర‌గా క‌లుగుతుంది.

బాదం ప‌ప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల‌కు, హార్మోన్ల‌కు మేలు చేస్తాయి.. బాదం ప‌ప్పును తింటుంటే ఆయా అవ‌య‌వాలు మెరుగ్గా ప‌నిచేస్తాయి. దీంతో పిల్లలు త్వ‌ర‌గా క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

తిన‌డానికి రుచిలో ఘాటుగా, కారంగా ఉన్నా మిర‌పకాయ‌ల వ‌ల్ల కూడా దంప‌తుల‌కు మేలే జ‌రుగుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌యవాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల స్త్రీల‌లో రుతుక్ర‌మ స‌మ‌స్య తొల‌గిపోతుంది. పీరియ‌డ్స్ స‌రిగ్గా వ‌స్తాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.