Ayurvedam : ఉసిరికాయతో లివర్‌ను క్లీన్‌ చేసేద్దాం..! డీటాక్సిఫై చేయకపోతే డేంజరే

Ayurvedam : ఉసిరికాయ వాల్యూ తెలిస్తే.. మీరు బంగారం కంటే ఎక్కువగా చూసుకుంటారు తెలుసా..? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు.. ఆ అన్ని ఇంద్రియాలకు ఉసిరికాయే మూలం తెలుసా..?

Ayurvedam : ఉసిరికాయతో లివర్‌ను క్లీన్‌ చేసేద్దాం..! డీటాక్సిఫై చేయకపోతే డేంజరే


Ayurvedam : ఉసిరికాయ వాల్యూ తెలిస్తే.. మీరు బంగారం కంటే ఎక్కువగా చూసుకుంటారు తెలుసా..? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు.. ఆ అన్ని ఇంద్రియాలకు ఉసిరికాయే మూలం తెలుసా..? జుట్టు సమస్యలున్నా, కళ్ల సమస్యలు ఉన్నా, కిడ్నీ సమస్యలు ఉన్నా, కాలేయ సమస్యలు ఉన్నా.. అసలు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా. ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది. తొలినాళ్లలో మీకు వచ్చే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా సింపుల్‌గా ఉసిరికాయతో సెటిల్‌ చేసుకోవచ్చు. ఉసిరికాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి మ‌న శ‌రీరానికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. చ‌ర్మం, వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు ఉసిరికాయ ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే లివ‌ర్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి కూడా ఉసిరి చ‌క్క‌గా ప‌నిచేస్తుంది.
Liver cancer | What causes liver cancer? | WCRF International
ఉసిరికాయ‌ల‌లో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం ఉసిరికాయ‌ల‌ను తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరికాయ‌ల్లో విట‌మిన్ సి, ఐర‌న్‌, కాల్షియంలు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల లివ‌ర్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.
నిత్యం ప‌లు ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను తినేవారు వాటికి బ‌దులుగా తాజా ఉసిరికాయ ప‌చ్చ‌డిని తింటే ఎంతో మంచిది.
ఉసిరికాయ‌ల‌ను నిత్యం 2 చొప్పున కొద్దిగా న‌ల్ల ఉప్పుతో క‌లిపి తిన‌వ‌చ్చు.
రాత్రి పూట ఉసిరికాయ ముక్క‌ల‌ను నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ నీటిని అలాగే మ‌రిగించి టీ లా త‌యారు చేసుకుని తాగాలి.
నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే 2 టేబుల్ స్పూన్ల మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగ‌వ‌చ్చు.
ఇలా పైన తెలిపిన విధంగా ఉసిరికాయ‌ల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. లివర్‌ సమస్యలు లేకున్నా.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఉసిరిని వాడితే.. ఇమ్యునిటీ పవర్‌ పెరిగి అన్ని అవయవాలకు మేలు జరుగుతుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.