ఈ రెండు రుగ్మతల వల్లే కిడ్నీ సమస్యలు వస్తాయి

మన శరీరంలో కిడ్నీల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కిడ్నీలకు ఏమాత్రం అనారోగ్యానికి గురైనా మన పరిస్థితి అదో గతే. అంత ప్రాధాన్యత అవయవం కిడ్నీ. కాబట్టి కిడ్నీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే.

ఈ రెండు రుగ్మతల వల్లే కిడ్నీ సమస్యలు వస్తాయి


మన శరీరంలో కిడ్నీల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కిడ్నీలకు ఏమాత్రం అనారోగ్యానికి గురైనా....మన పరిస్థితి అదో గతే. అంత ప్రాధాన్యత అవయవం కిడ్నీ. కాబట్టి కిడ్నీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే...నీరు తప్పనిసరిగా తాగాలి. ఈ విషయం చిన్న పిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు తెలుసు. కానీ చాలా మంది దీన్ని పట్టించుకోరు.

Kidney Images – Browse 155,219 Stock Photos, Vectors, and Video | Adobe  Stock

నేటి యువత కూడా అశ్రద్ధ చేస్తోంది. సరైన సమయానికి భోజనం లేకపోయనా ఫర్లేదు గానీ...నీళ్లు మాత్రం తప్పనిసరిగా తాగాలి. ఎందుకంటే మన వాతావరణంలో మార్పులు, శరీరంలో మార్పుల వల్ల దేహంలో ఉండే నీటిశాతం ఆవిరైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సరైన మోతాదులో నీరు తాగకపోతే...ఉన్న నీటి శాతం కూడా ఆవిరైపోతే దేహం కుంచించుకుపోతుంది. తద్వారా కిడ్నీలు పాడైపోతాయి. మన తాగే నీటినే కిడ్నీలు ఆసరాగా తీసుకుని శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ఇంట్లో ఉండే మట్టిని మామూలుగా తుడిస్తే పోదు. అదే నీళ్లతో కడిగితే త్వరగా పోతుంది. ఇదే టెక్నిక్‌ కిడ్నీలకు వర్తిస్తుంది.

కిడ్నీల యొక్క లాభమెంటో...అవి పూర్తిగా చెడిపోయినప్పుడే తెలుస్తుంది. అదే ముందుగానే జాగ్రత్త వహిస్తే బెటర్‌ కదా. కిడ్నీలు చేసే మేలేంటో ముందు తెలుసుకోవాలి. శరీరంలో ఎక్కువైన నీటి శాతాన్ని మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంది. దానివల్ల వ్యర్థాలను మూత్రంతోనే విసర్జించేలా చేస్తుంది. కిడ్నీలు గంటకు 5 లీటర్ల రక్తాన్ని వడకట్టి శుద్ధి చేస్తూ ఉంటుంది. అంటే రోజుకు 48 సార్లు 5 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఇది ప్రతిరోజూ కిడ్నీల చేసే పని. రక్తంలో PH వ్యవస్థను బ్యాలెన్స్‌గా ఉంచేందుకు కిడ్నీలు బాగా ఉపయోగపడుతాయి.

Kidney failure - MyDr.com.au

అంతేకాకుండా శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు....ఉన్న నీటిని యూరిన్‌ రూపంలో బయటకు పోనివ్వకుండా బ్యాలెన్స్‌ చేస్తాయి. అయితే ఇందులో ముఖ్యమైన లాభమేమిటంటే... రక్తపోటును రెగ్యూలేట్‌ చేయడానికి కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కిడ్నీలు దెబ్బతింటే....బీపీ కంట్రోల్‌లో ఉండదు. ఎందుకంటే బీపీని రెగ్యులేట్‌ చేయడానికి హార్మోన్లను కిడ్నీలు రిలీజ్‌ చేస్తాయి.

విటమిన్‌ Dని యాక్టివేట్‌ చేయడానికి కిడ్నీలు ఉపయోగపడతాయి.  కిడ్నీలు పాడైతే...విటమిన్‌ Dని శరీరంలో సరిగ్గా వాడుకోలేదు. ఇంకో సమస్య కూడా ఉంది. అదేంటంటే...కిడ్నీలు నాశనమైతే....రక్తం తగ్గుతుంది. దానివల్ల రక్తహీనత కూడా వస్తుంది.

కిడ్నీలు పాడైనా మార్పిడి జరిగినా ఎంతో బాధగా ఉంటుంది. నడవలేం, కూర్చోలేం. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కిడ్నీలను పదిలంగా చూసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్‌, హైబీపీ రాకుండా జాగ్రత్త వహించాలి. అవి గానీ వస్తే కిడ్నీలు కచ్చితంగా పాడైపోతాయి.  కాబట్టి ఆ రుగ్మతలు రాకుండా ఉండాలంటే ఉప్పులేని ఆహారం తీసుకోవాలి. నేచురల్‌ ఫుడ్‌ తీసుకోవాలి. అప్పుడు డయాబెటిస్‌, హైబీపీ రాకుండా ఉంటాయి. కిడ్నీ సమస్యలు రావు. మంచి ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం. ఆలోచించు మిత్రమా..నీ ఆరోగ్యం నీ చేతుల్లో.

విటమిన్‌ D యాక్టివేట్‌ చేయడానికి ఉపయోగపడతాయి
డయాబెటిస్‌, హైబీపీ రాకుండా జాగ్రత్త వహించాలి
ఉప్పులేని ఆహారం తీసుకోవాలి
రక్తపోటును రెగ్యూలేట్‌ చేయడానికి ఉపయోగపడతాయి
క్తంలో PH వ్యవస్థను బ్యాలెన్స్‌గా ఉంచుతుంది

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.