పుచ్చగింజలు, మొక్కజొన్న పీచుతో కిడ్నీలను క్లీన్‌ చేద్దామా..!

మన శరీరంలో ఉండే అవయావాల్లో మూత్రపిండాలు చాలా ముఖ్యమైనవి. రోజూ రక్తాన్ని వడపోస్తూ చాలా కష్టపడతుంటాయి. మలినాలను, విషపదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడం వీటి ప్రాధాన కర్తవ్యం. కిడ్నీలు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మూత్ర‌పిండాల్లో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోకుండా వాటిని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

పుచ్చగింజలు, మొక్కజొన్న పీచుతో కిడ్నీలను క్లీన్‌ చేద్దామా..!


మన శరీరంలో ఉండే అవయావాల్లో మూత్రపిండాలు చాలా ముఖ్యమైనవి. రోజూ రక్తాన్ని వడపోస్తూ చాలా కష్టపడతుంటాయి. మలినాలను, విషపదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపడం వీటి ప్రాధాన కర్తవ్యం. కిడ్నీలు బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మూత్ర‌పిండాల్లో మ‌లినాలు, విష ప‌దార్థాలు పేరుకుపోకుండా వాటిని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. మూత్ర‌పిండాల్లో విష ప‌దార్థాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల ఆ ప్ర‌భావం మ‌న చ‌ర్మం, జుట్టుతో పాటు ఇత‌ర అవ‌య‌వాల మీద కూడా ప‌డుతుంది.

మూత్ర‌పిండాల్లో విష ప‌దార్థాలు పేరుకుపోవ‌డంతో పాటు వీటికి సంబంధించిన ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య నేటి త‌రుణంలో ఎక్కువవుతుంది. అస్త‌వ్య‌స్థ‌మైన మ‌న ఆహార‌పు అల‌వాట్లే మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అవుతుంది.  
 చ‌క్క‌టి ఆహార నియ‌మాలు, జీవ‌న శైలి ఉన్న‌ప్ప‌టికి మూత్ర‌పిండాల్లో విషప‌దార్థాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల వాటికి సంబంధించిన స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కొన్ని ర‌కాల చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం మూత్ర‌పిండాల్లో విష పదార్థాలు, మ‌లినాలు పేరుకుపోకుండా చేసుకోవ‌చ్చు. మూత్ర‌పిండాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవ‌చ్చు. 
  
మూత్రపిండాలను క్లీన్‌ చేసుకోవడానికి కార్న్ సిల్క్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మొక్క‌జొన్న కంకి ఒలిచినప్పుడు చాలా పీచు వస్తుంది. ఇది మొత్తం మనం తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేస్తాం. కానీ దీనితో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు శుభ్ర‌ప‌డ‌డంతో పాటు మ‌నం అనేక ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. మొక్క‌జొన్నలో పీచును తీసుకుని ఎండ‌బెట్టాలి. త‌రువాత ఈ పీచును 50 గ్రాముల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసి 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. త‌రువాత దీనిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత తాగాలి. ఇలా నెల‌కు ఒక‌టి లేదా రెండు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో పేరుకుపోయిన మ‌లినాలు తొల‌గిపోయి వాటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. 
అలాగే మూత్ర‌పిండాల‌ను డిటాక్సిఫికేష‌న్ చేయ‌డంలో మ‌న‌కు పుచ్చ‌కాయ గింజ‌లలు కూడా ఎంతగానో ఉప‌యోగ‌ప‌డతాయి. తాజాగా పుచ్చ గింజ‌ల‌ను లేదా మార్కెట్‌లో ల‌భించే పుచ్చ‌గింజ‌ల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌రుచుకోవ‌చ్చు. ఈ టీ ని త‌యారు చేసుకోవ‌డానికి రెండు టేబుల్ స్పూన్ల పుచ్చ‌గింజ‌ల‌ను పొడిగా చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ఈ పొడిని అలాగే రెండు గ్లాసుల నీళ్లు పోసి క‌ల‌పాలి. ఈ నీటిని 5 నుంచి 6 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని బాటిల్‌లోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న టీని రోజుకు 2 సార్లు తీసుకోవ‌చ్చు. 
ఈ పుచ్చ‌గింజ‌ల టీ ని వారానికి ఒక‌సారి తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల ఆరోగ్యం మెరుగుప‌డ‌డంతో పాటు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటిస్తూ చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ, మంచి జీవ‌న శైలిని పాటించ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.