Sesame : నరాల శక్తికి నిలబెట్టడానికి దొరికిన అద్భుత ఔషధమే నువ్వులు.. ఒక్కసారి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. 

sesame oil ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా కోల్పోయిన నరాల శక్తిని సైతం తిరిగి పుంజుకునేలా చేస్తుంది. చాలా ఏళ్ల నుంచి నువ్వుల నూనె కోసం వింటూ వస్తాము కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మాత్రం పట్టించుకోము

Sesame : నరాల శక్తికి నిలబెట్టడానికి దొరికిన అద్భుత ఔషధమే నువ్వులు.. ఒక్కసారి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. 
Benefits of sesame oil


Benefits of sesame : మనకు దొరికే ఆహార పదార్థాల్లో అత్యధిక పోషక విలువలు కలిగి శరీరానికి మేలు చేసే పదార్థం ఏ రూపంలో తీసుకున్న శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా sesame oil ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా కోల్పోయిన నరాల శక్తిని సైతం తిరిగి పుంజుకునేలా చేస్తుంది.

చాలా ఏళ్ల నుంచి నువ్వుల నూనె కోసం వింటూ వస్తాము కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మాత్రం పట్టించుకోము ఇలా చేసి ఇన్ని రోజులు ఎంత తప్పు చేసారో దానిలో ఉండే పోషకాలు అది చేసే మేలు గురించి తెలిస్తే తెలుస్తుంది. 

నువ్వుల నూనెతో లాభాలు.. 

నువ్వులు గాయాలని మార్పటానికి ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఎలాంటి గాయాన్ని అయినా మానపటంలో నువ్వుల నూనె ముందుంటుంది. అందుకే ఆపరేషన్లు జరిగినప్పుడు ఏవైనా పెద్ద గాయాలు తగిలినప్పుడు నువ్వుల నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.

చాలామందికి కాళ్లు పగిలిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వారు రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లతో కాళ్ళను కడుక్కొని నువ్వుల నూనె రాసి సాక్సులు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

నువ్వుల నూనెతో మర్దన శరీరంలో ఉండే చెడుకోలస్ట్రాల్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా నువ్వుల నూనె చర్మం లోకి తొందరగా ఇంకిపోయే ప్రభావం ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని కరిగించి ఎముకలను గట్టిపరుస్తుంది.

పరగడుపున రెండు చెంచాల నువ్వుల నూనె తీసుకోవడం వల్ల చిన్న పేగులు పెద్ద పేగులు సైతం శుభ్రపడతాయి.

ఆయిల్ పుల్లింగ్ చేసేవారు నువ్వుల నూనెతో ఉపయోగించటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

వారానికి ఒక్కసారి అయినా నువ్వుల నూనెతో తల మర్దన చేసుకొని తల స్నానం చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మనసు మెదడు ప్రశాంతంగా మారుతాయి.

స్విమ్మింగ్ చేసేవారు కొద్దిగా నువ్వుల నూనె ఒంటికి రాసుకొని చేయడం వల్ల నీటిలో ఉన్న ఫ్లోరింగ్ ప్రభావం శరీరంపై పడదు.

కీళ్ల నొప్పులు ఉన్నవారు నువ్వుల నూనె వేడి చేసి మర్దనా చేస్తే మంచి ఉపశమనం దొరుకుతుంది. 

హార్మోన్లను అదుపు చేసి సక్రమంగా పనిచేసే విధంగా చేయటానికి నువ్వులు ఎంతగానో సహాయపడతాయి. బెల్లం నువ్వులు కలిపినా ఉండలను ఎదుగుతున్న అమ్మాయిలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు. నువ్వుల నూనెతో చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల నరాల శక్తి మెరుగు పడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.