Depression : డిప్రెషన్ ముందు ఓడిపోవద్దు.. దీన్ని కచ్చితంగా జయించండి.. 

Depression : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి దీని వలన ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటున్నాయి ఉద్యోగ సంబంధిత కుటుంబ సమస్యలతో చాలామంది డిప్రెషన్కు

Depression : డిప్రెషన్ ముందు ఓడిపోవద్దు.. దీన్ని కచ్చితంగా జయించండి.. 
depression in telugu


Depression : ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య మానసిక ఒత్తిడి దీని వలన ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటున్నాయి ఉద్యోగ సంబంధిత కుటుంబ సమస్యలతో చాలామంది డిప్రెషన్కు గురవుతున్నారు అయితే దీని నుంచి బయట పడాలి అంటే కొన్నింటిని పాటించాలని చెబుతున్నారు మానసిక నిపుణులు..

ఎలాంటి మనిషి అయినా కచ్చితంగా డిప్రెషన్ బారి నుండి బయటపడాలి లేదు అంటే పెను ప్రమాదం తప్పదు.. డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏ పని పైన ఏకాగ్రత ఉండకపోవడం చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరిగా బాధపడటం మనసంతా గందరగోళంగా ఉండటం ఎక్కడికైనా పారిపోవాలి అనిపించడం వంటి ఎన్నో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిని మనిషి తనకు తాను జయించి తీరాల్సిందే.. 

ముఖ్యంగా మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడానికి మనిషి ఒక పనిని ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా ఏదో ఒక విషయం మీద తన ఏకాగ్రతను ఉంచాలి. ఖాళీగా ఉంటే ఆలోచనలు ఎక్కువై ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది అలాగే డిప్రెషన్ దూరం చేసి మరొక ఆయుధం వ్యాయామం నిత్యం శరీరానికి శ్రమ కలిగించడం వల్ల మన శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు విడుదలవుతాయి ముఖ్యంగా డోపమైన్ విడుదలై ఆనందంగా ఉండటానికి కారణం అవుతుంది అలాగే శారీరక శ్రమ మానసిక ఆందోళనను దూరం చేస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి.. 

అలాగే మనిషిని ఏ విషయం అయితే తీవ్రంగా బాధిస్తుందో దానికి దూరంగా ఉండటం తెలుసుకోవాలి కష్టమైన కొన్ని విషయాలు మరిచిపోవడం నేర్చుకోవాలి తనని తాను ప్రేమించుకోవడం అలవాటు చేసుకుంటూ జీవితం తన కోసమే అంటూ గుర్తించాలి. ఈ సమాజంలో జరిగే ప్రతి విషయం తాత్కాలికమైననని మనతో మనం మాత్రమే ఉంటామని అనుకోవాలి అలాగే ఎప్పుడో వదిలేసిన పనుల పైన ఏకాగ్రత పెట్టాలి నచ్చిన పనులు చేసుకుంటూ కొత్త విషయాన్ని నేర్చుకునే దిశగా అడుగులు వేయాలి ఈ ప్రయత్నంలో కొత్త మనుషులతో పరిచయాలు పెంచుకుంటూ ఎన్నో విషయాలు తెలుస్తాయి దీనివలన జీవితాన్ని మరొక కొత్త కోణంలో చూడటం అలవాటు అవుతుంది. ఇలాంటి సమయంలో మానసిక ఆందోళన తగ్గి జీవితం మీద ఆశ పుడుతుంది.

జీవితంలో కొన్ని పరిస్థితులను దాటడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఆత్మన్యూనతా భావం చుట్టుముడుతుంది. నేను ఏమీ చేయలేను ఏమి సాధించలేను అనే ఆలోచనలు మనిషిని నిలువునా దహించి వేస్తాయి. ఇలాంటి పరిస్థితులను కచ్చితంగా దాటాలి. జీవితం కంటే ఏది ఎక్కువ కాదు అనే ఆలోచనను గట్టిగా నమ్మాలి. ఈ సమయం మారిపోతుంది ఈ పరిస్థితులన్నీ మారిపోయి మళ్లీ ఆనందాలు చేరువవుతాయి అని ఎవరికి వారు గట్టిగా చెప్పుకోవాలి. పని పైన ఏకాగ్రత పెట్టాలి.. అలాగే నిత్యం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక రకమైన పనిని ఏర్పరచుకోవాలి. స్నేహితులతో బంధువులతో గడపడం అలవాటు చేసుకోవాలి. వీటన్నిటి వల్ల డిప్రెషన్ తగ్గి మళ్ళీ కొత్త జీవితం మొదలవుతుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.