Face Steaming :నిద్రపోయే ముందు ముఖానికి ఆవిరి పడితే చర్మం మెరిసి పోతుందట..!

Face Steaming : మీరు రాత్రి నిద్రపోయే ముందు మొదటగా మీ ముఖాన్ని బాగా కడుక్కోవాలి. దీని కోసం మీరు తేలికపాటి ఫేస్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీంతో ముఖం నుంచి దుమ్ము, ధూళి, నూనె మొదలైనవన్నీ తొలగిపోతాయి.

Face Steaming :నిద్రపోయే ముందు ముఖానికి ఆవిరి పడితే చర్మం మెరిసి పోతుందట..!
Steam your face before sleeping for shiny skin


Face steaming : చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలంటే... ఏం ఏం వాడాలో మాత్రమే కాదు.. ఏం చేయకూడదో కూడా బాగా తెలిసి ఉండాలి. బరువు తగ్గాలంటే.. పరగడుపున చేసే టిప్స్‌ మంచి రిజల్ట్‌ ఇస్తాయి..అలాగే చర్మం అందంగా ఉండాలంటే.. రాత్రి పడుకునే ముందు చేసే చిట్కాలు బాగా పనిచేస్తాయి. మీరు మీ చర్మాన్ని ఆరోగ్యంగా మార్చాలనుకుంటే రాత్రి సమయంలో చర్మ సంరక్షణలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రోజంతా చెమట, ధూళి, నూనె, దుమ్ము, కాలుష్యం మొదలైన వాటి కారణంగా ముఖం చర్మం కలుషితమవుతుంది. దీని కారణంగా చర్మం స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేకపోతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు స్వయంగా రిపేర్ అవుతుంది. చర్మం సంరక్షణ కోసం బేసిక్‌గా ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..! 
మీరు రాత్రి నిద్రపోయే ముందు మొదటగా మీ ముఖాన్ని బాగా కడుక్కోవాలి. దీని కోసం మీరు తేలికపాటి ఫేస్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీంతో ముఖం నుంచి దుమ్ము, ధూళి, నూనె మొదలైనవన్నీ తొలగిపోతాయి. మీరు ఫేస్ వాష్ ఉపయోగించకూడదనుకుంటే.. మీరు ముఖాన్ని శుభ్రమైన నీటితోనూ కడగవచ్చు.

ముఖం కడిగిన తర్వాత కూడా నూనె, ధూళి రంధ్రాల లోపల నిల్వ ఉంటాయి. అందుకే మీరు పడుకునే ముందు ముఖంపై ఆవిరి ప‌ట్టాలి. ఇది రంధ్రాలను తెరుస్తుంది, వాటి లోపల ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను తొలగిస్తుంది. దీంతో ముఖం మెరుస్తుంది.
సాయంత్రం తగినంత నీటిని తీసుకోవాలి. నీటిని తాగడం వల్ల‌ మీ శరీరం నుంచి విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. దీనివల్ల చర్మానికి తేమ అందుతుంది. ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీటిని తాగండి...
రాత్రి పూట ఆహారంలో టమోటాలు, ఆలివ్ ఆయిల్, వోట్ మీల్, గ్రీన్ టీ, బ్రోకలీ మొదలైన పోషకాలు స‌మృద్ధిగా ఉండే ఆహారాల‌ను తినాలి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి.
రాత్రి పూట కొంద‌రు దిండుకు ముఖం ఆనించి నిద్ర‌పోతారు. ఇలా చేయ‌కూడ‌దు. దీంతో ముఖంపై ఎక్కువ‌గా ముడ‌త‌లు వ‌స్తాయి. బోర్లా పడుకునే అలవాటు ఉంటే వెంటనే ఆ అలవాటు మానేయండి.!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.