వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగుతున్నారా..? అమ్మో చాలా ప్రమాదం

చాలా మందికి ఉదయం లేచి హాట్‌ వాటర్‌లో తేనె, నిమ్మరసం వేసుకుని తాగడం అలవాటు. మంచి జీర్ణక్రియ కోసం, బరువు తగ్గడం కోసం చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తుంటారు. కానీ వేడి నీళ్లలో తేనె వేయడం మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. తేనెను వేడి నీటిలో ఎందుకు తీసుకోకూడదో ఈరోజు మనం తెలుసుకుందాం.

వేడినీళ్లలో తేనె కలుపుకుని తాగుతున్నారా..? అమ్మో చాలా ప్రమాదం


చాలా మందికి ఉదయం లేచి హాట్‌ వాటర్‌లో తేనె, నిమ్మరసం వేసుకుని తాగడం అలవాటు. మంచి జీర్ణక్రియ కోసం, బరువు తగ్గడం కోసం చాలా మంది ఈ పద్ధతిని పాటిస్తుంటారు. కానీ వేడి నీళ్లలో తేనె వేయడం మంచిది కాదని ఆయుర్వేదం చెబుతోంది. తేనెను వేడి నీటిలో ఎందుకు తీసుకోకూడదో ఈరోజు మనం తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవాళ్లు వేడినీళ్లలో తేనె వేసుకుని తాగాలి. దీంతో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని, కొవ్వు కరుగుతుందని చెబుతున్నారు. అందుకే చాలా మందికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లలో తేనె కలిపి తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది అంత మంచిది కాదని ఆయుర్వేదం అంటోంది.

ఆయుర్వేదం ప్రకారం వేడి నీటిలో తేనె తాగడం వల్ల విషంగా మారుతుంది. ఇది స్లో పాయిజన్ లాగా అవుతుంది. తేనెను వేడినీళ్లలో కలుపుకొని తాగితే కఫం ఎక్కువై అనేక సమస్యలు వస్తాయి. తేనెను సహజంగానే వినియోగించాలి. తేనెను వేడి చేస్తే విషపూరితం అవుతుందని, అందుకే తేనెను వేడి నీళ్లలో వేసి సేవించడం మంచిది కాదని చెబుతారు. మీరు రసం, సలాడ్, గృహ ఔషధం తయారీలో ఉపయోగించవచ్చు. అదే తేనెను వంటలో వాడకూడదు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌గా ఆహారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే తేనెను ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదని చెబుతారు.
అనేక ఆరోగ్య సమస్యలకు హోం రెమెడీగా తేనె ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, కఫం నుండి బయటపడటానికి తేనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కల్తీ తేనెకు బదులుగా సహజమైన తేనెను వాడితే ఇలాంటి ప్రయోజనాలు పొందవచ్చు. తేనెను వేడి చేస్తే అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అంటే బ్యాక్టీరియాతో పోరాడే లక్షణాలు నశిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నశిస్తాయి. అందుకే వేడి నీళ్లలో తేనె కలిపి తాగడం ఆరోగ్యకరం కాదని ఆయుర్వేదం చెబుతోంది.
వేడెక్కిన తేనె స్లో పాయిజన్ అని ఆయుర్వేదం చెబుతోంది. శరీరంలోకి చేరాక విషపూరితంగా మారుతుంది. తేనెతుట్టే నుంచి సేకరించిన తేనెలో యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‍లు లభిస్తాయి. ఇది షుగర్ రోగులకు మంచిది. కానీ మార్కెట్‍లో దొరికేది పాశ్చరైజ్డ్ తేనె డయాబెటిస్ రోగులకు హానికలిగస్తుంది. రసాయనలతో కూడిన స్వీటెనర్ ఉపయోగిస్తారు. తేనెకు వేడి తగిలితే అందులోని పోషకాలు నిర్వీర్యం అవుతాయి. వేడి నీటిలో కాకుండా గది ఉష్ణోగ్రతను కలిగి ఉండే నీటిలో తేనె కలుపుకొని తాగడం బెటర్.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.