Ayurveda Benefits of Arjun tree : స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచే అద్భుతమైన మొక్క.. రోజు ఇలా తీసుకుంటే చాలు..!

Ayurveda Benefits of Arjun tree : ఈరోజుల్లో సంతాన లోపం సమస్యలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి.. మగవారిలో ఈ సమస్య రావాడానికి ప్రధాన కారణం.. స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉండటం, స్పెర్మ్‌ క్వాలిటీగా లేకపోవడం.. దీనికోసం

Ayurveda Benefits of Arjun tree : స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచే అద్భుతమైన మొక్క.. రోజు ఇలా తీసుకుంటే చాలు..!


Ayurveda Benefits of Arjun tree : ఈరోజుల్లో సంతాన లోపం సమస్యలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి.. మగవారిలో ఈ సమస్య రావాడానికి ప్రధాన కారణం.. స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉండటం, స్పెర్మ్‌ క్వాలిటీగా లేకపోవడం.. దీనికోసం.. ఇప్పటికే ఎన్నో మందులు వాడుతున్నారు, ఏవేవో ప్రయత్నాలు కూడా చేసే ఉంటారు. అర్జున వృక్షం (తెల్లమద్ది). ఇది మీరు కచ్చితంగా చూసే ఉంటారు..ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇది మగవారికి బాగా ఉపయోగపడుతుంది.. తెలుపు, ఎరుపు రంగుల్లో ఉంటుంది. గుండెజబ్బులు, ఆస్త‌మా ఉన్న‌వారికి, ఎముక‌లు విరిగిన వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. దీని బెర‌డులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ప‌లు ఆయుర్వేద ఔష‌ధాల్లోనూ దీన్ని వాడుతారు.
Arjun Plant: Care, Uses, and Toxicity of Terminalia Arjuna

అర్జున వృక్షం వల్ల కలిగే ప్రయోజనాలు..

అర్జున వృక్షం బెర‌డును పాల‌లో వేసి బాగా మ‌రిగించి డికాష‌న్ కాయాలి. దాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగుతుండాలి. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది.
అర్జున వృక్షం బెరడును మెత్త‌గా నూరి చూర్ణంగా మార్చుకోవాలి. దాన్ని పాయ‌సంలో క‌లిపి తీసుకుంటే ఆస్త‌మా త‌గ్గుతుంది. 
అర్జున బెర‌డును చూర్ణంగా చేసి దాన్ని తేనెతో కలిపి ఉద‌యం, సాయంత్రం తీసుకుంటే విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
అర్జున బెర‌డు చూర్ణాన్ని తేనెతో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై మొటిమ‌లు ఉన్న చోట రాయాలి. నిత్యం ఇలా చేస్తే మొటిమ‌లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి. ముఖం య‌వ్వ‌నంగా ఉంటారు.
అర్జున బెరడును కషాయంగా చేసుకుని తాగుతుంటే కాలినగాయాలు, పుండ్లు తగ్గుతాయి.
అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే పురుషుల్లో వీర్యం బాగా ఉత్ప‌త్తి అవుతుంది. సంతానం క‌లిగేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు పోతాయి. శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. వీర్య క‌ణాల నాణ్య‌త పెరుగుతుంది.
అర్జున చెట్టు బెరడును నూరి గంధంలా తీయాలి. దాన్ని గడ్డ ఉన్న చోట రాసి పైన క‌ట్టు క‌ట్టాలి. దీంతో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. కాలిన గాయాలు, పుండ్లు, దెబ్బ‌ల‌పై రాస్తున్నా కూడా అవి త‌గ్గిపోతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.