నిమ్మ తొక్కతో ఎన్ని ప్రయోజనాలో.. మరి దీన్ని రోజు ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలో తెలుసా!

సాధారణంగా  నిమ్మరసం పిండుకుని తొక్కను పడేస్తుంటాం. అయితే మీకు తెలుసా, ఈ నిమ్మ పండు తొక్క వల్ల  కూడా, ఆరోగ్యానికి  అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

నిమ్మ తొక్కతో ఎన్ని ప్రయోజనాలో.. మరి దీన్ని రోజు ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలో తెలుసా!


సాధారణంగా  నిమ్మరసం పిండుకుని తొక్కను పడేస్తుంటాం. అయితే మీకు తెలుసా, ఈ నిమ్మ పండు తొక్క వల్ల  కూడా, ఆరోగ్యానికి  అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Lemon Peel : నిమ్మ‌కాయ తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా ? ఈ లాభాలు తెలిస్తే ఇక‌పై  అలా చేయరు..!

నిమ్మ తొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు..

నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే నిమ్మకాయ తొక్కలో  విటమిన్ సి ఉంటుంది. అదనంగా, ఫ్లేవనాయిడ్ D-లిమోనెన్ కూడా  తొక్కలో సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు  శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి . దీని నుంచి చాలా ఆరోగ్య ప్రయోజనాలను ఆశించవచ్చు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  ధూమపానం, అధిక రక్తపోటుతో బాధపడేవారు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, మధుమేహం, బరువు పెరగడం లేదా అధిక మానసిక ఒత్తిడికి లోనవడం, కొన్ని చెడు అలవాట్లను అలవర్చుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. కానీ నిమ్మకాయ తొక్కలో ఉండే సహజమైన ఫ్లేవనాయిడ్ విటమిన్ సి, పెక్టిన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కంటెంట్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ కంటెంట్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది .గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
సాధారణంగా నిమ్మకాయ తొక్కలో ఉండే ఫ్లెవెన్ క్యాన్సర్ కారకాల నుండి కాపాడతాయి శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.  తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచి, క్యాన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి.  ప్రధానంగా నిమ్మ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్ మూలకాలు శరీరం నుంచి విష వ్యర్థాలను తొలగిస్తాయి. వాపుకు కారణమయ్యే ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌తో పోరాడుతాయి. 
ఎన్నో ఏళ్ల నుంచి మధుమేహం సమస్యతో బాధపడేవారు ఈ సమస్యను అదుపు చేసుకోవాలి అంటే నిమ్మ తొక్కతో ఇలా ప్రయత్నించాలి. ముఖ్యంగా దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పెక్టిన్ అని పిలువబడే ఫైబర్ కంటెంట్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను పెంచుతుంది. ఇది శరీర బరువును తగ్గించడమే కాకుండా రక్తంలో అధిక చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. నిమ్మ తొక్క మాత్రమే కాదు, నిమ్మరసం కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చక్కెర లేకుండా నిమ్మరసం మధుమేహ రోగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 
నిమ్మ తొక్కను ఎలా ఉపయోగించాలంటే.. నిమ్మకాయ నుండి రసాన్ని తీసిన తర్వాత దాని తొక్కను పారేయకుండా ఎండలో సరిగ్గా ఆరబెట్టి, ఆపై దానిని మెత్తగా, పొడిగా చేయాలి. అంతేకాదు రోజువారీ వంటల్లో కొద్దిగా నిమ్మతొక్కను తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతే కాకుండా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఈ పొడిని కలిపి తాగితే ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్న అనేక రకాల ఆరోగ్య సమస్యలు సైతం అదుపులో ఉంటాయి అలాగే రోజు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పళ్ళు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.