డైటింగ్‌ చేసినా రిజల్ట్ రాకపోవడానికి కారణమెంటో తెలుసా?? 

ప్రస్తుత ఆహార నియమాల విషయంలో మనుషులు జంక్ ఫుడ్స్‌కు అలవాడు పడిపోయారు. ఇప్పుడు ఆరోగ్యం కోసం డైట్ పేరిట ఆహార నియమాలు పాటిస్తున్నారు. చాలా మంది సరైన డైటింగ్ ప్లాన్స్‌ను డబ్బులు పెట్టి మరీ

డైటింగ్‌ చేసినా రిజల్ట్ రాకపోవడానికి కారణమెంటో తెలుసా?? 


ప్రస్తుత ఆహార నియమాల విషయంలో మనుషులు జంక్ ఫుడ్స్‌కు అలవాడు పడిపోయారు. ఇప్పుడు ఆరోగ్యం కోసం డైట్ పేరిట ఆహార నియమాలు పాటిస్తున్నారు. చాలా మంది సరైన డైటింగ్ ప్లాన్స్‌ను డబ్బులు పెట్టి మరీ కొనుక్కొంటున్నారు. అయితే చాలా మంది డైట్ చేస్తున్నా ఫలితం రావడంలేదని బాధపడుతుంటారు. రోజూ డైటింగ్‌ చేసినా రిజల్ట్ రాకపోవడానికి కారణం మనం ఫాలో అవుతున్న డైట్‌పై స్పష్టత లేకపోవడమే అంటున్నారు ఆహార నిపుణులు.
Essay On Balanced Diet (in English) for Classes 1, 2 & 3: 10 Lines, Short &  Long Paragraph
మొదట డైటింగ్ ఎందుకు చేస్తున్నామనే దానిపై క్లారిటీ కలిగి ఉండాలి. బరువు తగ్గడం కోసం చేస్తున్నామా? అందం కోసం చేస్తున్నామా? శారీరకంగా ధృడత్వం పొందడానికి చేస్తున్నామ లేదా మరేదైనా దానికోసం చేస్తున్నామా అనే క్లారిటీ డైట్‌ చేసే వ్యక్తికి ఎంతో అవసరమంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్.
బరువు తగ్గడం కోసం డైట్ చేసే వాళ్లు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు ఆహార నిపుణులు. ఎక్కువగా ఉన్న బరువును కొంత మేర తగ్గించుకోవాలంటే మొదట సరైన ఆహారం తీసుకోవాలి. బరువు తగ్గడానికి వ్యాయామం చేయాలి. వెంటనే రిజల్ట్ కోసం చూడకూడదు. రోజూ డైట్ పాటిస్తే క్రమంగా శరీరంలో మార్పు కనబడుతుంది. మీరు డైట్ చేస్తున్నా ఫలితం రావడంలేదని బాధపడవచ్చు. కానీ ఫలితం రావడం డైట్‌లో తగిన ఆహారాన్ని ఎంచుకోకపోవడమే కారణం. డైట్‌లో ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది.
మీ స్నేహితుల్లో ఎవరైనా చేసే డైట్‌నే మీరు కూడా ఫాలో అయితే.. అది ఫలితం చూపించకపోవచ్చు. ఎందుకంటే వారి వారి శరీరాలను బట్టి ప్రాధాన్యతలు ఉంటాయి. అందుకే డైట్ చేసే ముందు శరీర సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి.
DASH Diet: A Guide to the Scientific Plan for Lowering Blood Pressure
ఇప్పటికే బరువు తగ్గేందుకు డైటింగ్ చేసినట్లయితే.. ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకున్నాం. ఎలాంటి ఫలితం సాధించామనేది సమీక్షించుకోవాలి. మనకు నచ్చిన ఆహారం ఏమిటి? నచ్చని ఆహారం ఏమిటి? ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటికి తగినట్లు మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి. మనం చేసే డైట్ ప్రక్రియలో మొదట ఇష్టమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. దాని ద్వారా రోజూ ఆ ఆహారాన్ని తీసుకోవడం సులభతరం అవుతుంది. మనం ఎంపిక చేసుకునే డైటింగ్‌ను మన బడ్జెట్‌కు తగిన విధంగా చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. మన జీవనశైలికి సరిపోయేలా ఉండాలి. ఎక్కువ భోజనం హోటళ్లు, రెస్టారెంట్లలో తింటున్నామా? ఇంట్లో తింటున్నామా అనేది డైట్‌లో చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఎక్కువగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే తీసుకోవడానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇష్టం లేని ఆహారాన్ని డైట్‌లో చేరిస్తే ఎక్కువ కాలం పాటు డైటింగ్ ప్రక్రియను కొనసాగించలేము. ఏ మాత్రం మన డైట్‌ను భంగం కలిగించని ఆహారం మాత్రమే తీసుకోవాలి. డైటింగ్‌లో తీసుకునే ఫుడ్‌తో ఏదైనా సమస్యలు ఎదురవుతాయనేది తెలుసుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.