వీటిని రోజూ రాత్రి రాస్తే కళ్ల కింద నల్లనివలయాలు తగ్గుతాయి.. ఎలా చెయ్యాలంటే..?

మనుషులు ఎప్పుడూ డబ్బులను సంపాదించాలి.. గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు.. దాంతో ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు.. అలా చెయ్యడం వల్ల డబ్బులు ఏమో గానీ, జబ్బులు మాత్రం వస్తాయి.. ఒత్తిడి, టెన్షన్స్, నిద్రలేకపోవడం వల్ల కళ్ల

వీటిని రోజూ రాత్రి రాస్తే కళ్ల కింద నల్లనివలయాలు తగ్గుతాయి.. ఎలా చెయ్యాలంటే..?


మనుషులు ఎప్పుడూ డబ్బులను సంపాదించాలి.. గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు.. దాంతో ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు.. అలా చెయ్యడం వల్ల డబ్బులు ఏమో గానీ, జబ్బులు మాత్రం వస్తాయి.. ఒత్తిడి, టెన్షన్స్, నిద్రలేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు మరియు ముడుతలు కూడా ఏర్పడుతుంటాయి. అందుకు ప్రధాన కారణం నిద్రలేమి. సరైన నిద్ర లేకపోతే కంటి కింది వలయాలు ఏర్పడుతాయి.. వీటివల్ల మనుషులు అంద విహినంగా తయారు అవుతారు.. వీటిని ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించి ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇలా వచ్చిన వలయాలను, డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకునేందుకు కూడా మార్గాలు ఉన్నాయి. మనం నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో కంటికి బాదం, కొబ్బరి నూనెను పూసుకుని సుతి మెత్తంగా మర్దన చేయడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. నెయ్యిని కూడా కళ్ల కింది నిద్రపోయే ముందు రాసుకోవడం మంచిదే. అందులోనూ ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. పిస్తా, బాదం లాంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా మంచిదే. ఆకుకూరలు, పచ్చి కూరగాయలు తీసుకోవడంతో కళ్లకు, డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండేలా చూస్తాయి...


ఇకపోతే చాలాసేపు సూర్యరశ్మి తగిలేలా ఉంటే అది మెలనిన్ అనే వర్ణకం ఎక్కువగా స్రవించడం వల్ల ఈ ప్రాబ్రెమ్స్ వస్తాయి. రోజుకు సుమారు 8 గంటల వరకు నిద్రపోవాలి. అలా నిద్రపోవడంతో కంటికి కొంత మేరకు విశ్రాంతి కలుగుతుంది. వీటితో పాటే నీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి. మనం తీసుకునే రోజువారి ఆహారంలో కే విటమిన్ ఉండేలా చూసుకోవాలి.. యోగా లాంటివి కూడా చెయ్యాలి..ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు...

డార్క్ సర్కిల్స్ ను మాయం చేసే చిట్కాలు..

కంటికి బాదం, కొబ్బరి నూనెను పూసుకుని సుతి మెత్తంగా మర్దన చేయడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. నెయ్యిని కూడా కళ్ల కింది నిద్రపోయే ముందు రాసుకోవడం మంచిదే. అందులోనూ ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది. పిస్తా, బాదం లాంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా మంచిదే. ఆకుకూరలు, పచ్చి కూరగాయలు తీసుకోవడంతో కళ్లకు, డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండేలా చూస్తాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.