మిరియాల పొడిని ఇలా వాడితే చాలు..షుగర్‌, కీళ్ల నొప్పులు వెంటనే తగ్గుతాయి..

మన వంట ఇల్లు ఒకవైద్యశాల అన్న విషయం మనందరికీ తెలుసు.. మన వంట గదిలో దొరికే వాటితో ఎన్నో రకాల రోగాలు దూరం అవుతాయి.. వంటల్లో కారం వాడటం కూడా మంచిదే.. పూర్వ కాలంలో ఎక్కువగా కారం వాడేవాళ్ళు కాదు.

మిరియాల పొడిని ఇలా వాడితే చాలు..షుగర్‌, కీళ్ల నొప్పులు వెంటనే తగ్గుతాయి..


మన వంట ఇల్లు ఒకవైద్యశాల అన్న విషయం మనందరికీ తెలుసు.. మన వంట గదిలో దొరికే వాటితో ఎన్నో రకాల రోగాలు దూరం అవుతాయి.. వంటల్లో కారం వాడటం కూడా మంచిదే.. పూర్వ కాలంలో ఎక్కువగా కారం వాడేవాళ్ళు కాదు.. కేవలం మిరియాలతో కూరలకు ఘాటును తీసుకొచ్చేవాళ్ళు.. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా యంగ్ గా ఉండటమే కాదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.. మిరియాలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి.. ఈరోజు మనం షుగర్ పేషంట్స్ కు మిరియాలు ఏ విధంగా సహాయపడతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
50 g Black Pepper / Milagu Powder at best price - hbkonline.in
పూర్వకాలంలో వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడినే వాడేవారని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ, ప్రేగు పూతలు, అల్సర్లు వంటి సమస్యలతో బాధపడే వారు ఎండు కారాన్ని తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఎండు కారాన్ని పూర్తిగా మానేయాలి. సాధారణంగా ఎండు కారానికి బదులుగా వంటల్లో మిరియాల పొడి, పచ్చి కారాన్ని వాడడమే మంచిదని వారు చెబుతున్నారు..వంటల్లో మిరియాల పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇంటి చిట్కాల్లో అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు మనం మిరియాలతో కషాయాన్ని, మిరియాల పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. మిరియాల్లో పెప్పరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అలర్జీలకు కారణమయ్యే హిస్టమిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. ఇక మనకు దగ్గు తగ్గుతుంది. అలాగే మిరియాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో కూడా మిరియాలు మనకు ఎంతగానో సహాయపడతాయి..
అలాగే 8 వారాల పాటు తగినమోతాదులో మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ విధంగా మిరియాలు మనకు ఎంతో మేలు చేస్తాయని వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. ఒకసారి ట్రై చేసి చూడండి.. ఫలితం ఏంటో మాకు తెలపండి..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.