మనగఆకు రాగి రొట్టే: షుగర్‌ ఉన్నవాళ్లు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..!

మనం తినే ఆహారంలో.. ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనది. ఇది ఎంత హెల్తీగా తింటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. కానీ అదేంటో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను లైట్‌ తీసుకుంటారు. ఏదో ఒకటి తింటారు. కొందరైతే అసలేం తినరు. డైరెక్టుగా లంచ్‌ చేస్తారు. అది అస్సలు మంచిది కాదు. షుగర్‌ ఉన్నవాళ్లు అయితే ఉదయం కచ్చితంగా టిఫెన్‌ చేయాలి. వారికోసం హెల్తీగా, షుగర్‌ లెవల్స్‌ను

మనగఆకు రాగి రొట్టే: షుగర్‌ ఉన్నవాళ్లు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..!


మనం తినే ఆహారంలో.. ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనది. ఇది ఎంత హెల్తీగా తింటే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. కానీ అదేంటో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను లైట్‌ తీసుకుంటారు. ఏదో ఒకటి తింటారు. కొందరైతే అసలేం తినరు. డైరెక్టుగా లంచ్‌ చేస్తారు. అది అస్సలు మంచిది కాదు. షుగర్‌ ఉన్నవాళ్లు అయితే ఉదయం కచ్చితంగా టిఫెన్‌ చేయాలి. వారికోసం హెల్తీగా, షుగర్‌ లెవల్స్‌ను తగ్గించే ఒక టేస్టీ బ్రేక్‌ఫాస్‌ను మీ మీకోసం తెచ్చాం. రాగి మునగఆకును కలిపి చేసే రొట్టెలు ఇవి.. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేయండి.!
Ragi Rotte : రాగి రొట్టెల‌ను చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.. ఇలా చేస్తే  మెత్త‌గా, మృదువుగా వ‌స్తాయి..

 కావాల్సిన పదార్థాలు:

 రాగిపిండి రెండు కప్పులు, గోధుమపిండి కప్పు, మునగ ఆకు కప్పు, చిన్న అల్లం ముక్క, నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరగండి, మిరియాల పొడి అరచెంచా, ఉప్పు తగినంత, నెయ్యి రెండు చెంచాలు,

తయారీవిధానం:

ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నెలో రాగిపిండి, గోదుమపిండి, పచ్చిమిర్చి సన్నని ముక్కలు, అల్లం తురుము, మునగాకు, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని కలుపుకోండి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటూ పిండిని పక్కన పెట్టండి. ఆ తర్వాత.. ముందుగా కలుపుకున్న పిండిని ఉండల్లా చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. వేడి పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. రెండు వైపులా అంచుల వెంబడి నెయ్యి వేసుకుని కాస్త రంగు మారేదాకా కాల్చుకోండి. ఈ రాగి రొట్టెల్ని ఏదైనా కర్రీతో లేదా చట్నీతో సర్వ్ చేసుకోని తింటే రుచిగా ఉంటుంది. చల్లని పెరుగుతో అద్దుకుని తిన్నా సూపర్‌గా ఉంటుంది. ఒకరోజు ట్రై చేసి చూడండి.!
ఎప్పుడు తినే ఆ ఇడ్లీ, దోస, వడ, ఉప్మాలే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి హెల్తీ టిఫెన్స్‌ కూడా ట్రై చేసి చూడండి. వీటిని కేవలం షుగర్‌ ఉన్నవళ్లు మాత్రమే కాదు. మాములు వాళ్లు కూడా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకున్నవాళ్లు వీటిని ఉదయం లేదా రాత్రుల్లు తింటే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.