చెమట వాసనతో ఎక్కడా నిలబడలేకపోతున్నారా.. ఇబ్బందే మరి

శరీరం నుంచి వచ్చే చెమటలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే భరించలేనంత వాసన వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది తల వెంట్రుకలు, పాదాలు, చర్మపు మడతలు, పొట్ట కింద భాగం, జననేంద్రియాలు, చెవుల దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటుంది.

చెమట వాసనతో ఎక్కడా నిలబడలేకపోతున్నారా.. ఇబ్బందే మరి
Problem with sweat smell


Bad sweat smell : భరించలేని వాసన శరీరం నుంచి వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఎవరికైనా చికాకు అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఎదుటి మనిషి ఇబ్బందిగా ఫీలవుతారు ఏమో అనే భావనే సగం ఆత్మనునతకి గురిచేస్తుంది. సాధారణంగా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేరు. తమలో తామే ఎంతగానో మదన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యని తేలికగా తగ్గించుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సిందే.

శరీరం నుంచి వచ్చే చెమటలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే భరించలేనంత వాసన వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది తల వెంట్రుకలు, పాదాలు, చర్మపు మడతలు, పొట్ట కింద భాగం, జననేంద్రియాలు, చెవుల దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ చెమట పట్టడమే దీనికి కారణం. ఇలా జరిగినప్పుడు మనసు చిరాకుగా అనిపించడమే కాకుండా నలుగురితో కలవలేకపోవడం, ఎక్కడ నిలబడలేక పోవడం, ప్రయాణంలో సైతం చాలా చిరాకుగా అనిపించడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జీర్ణం అయ్యి జీర్ణం అవ్వలేనివి వివిధ రూపాల్లో బయటకు వస్తాయి. ఈ రకంగానే చెమట రూపంలో కొన్ని విష పదార్థాలు బయటకు వస్తూ ఉంటాయి. అయితే మనిషికి ఒక శరీర స్వభావం ఉంటుంది. కాబట్టి అందరి దగ్గర ఒకటే చెమట వాసన రాదు.

చెమట అధికంగా పట్టడానికి కారణాలు ఏంటంటే..

ఎక్కువ కాలం మందులు వాడటం, విపరీతంగా పొగ తాగటం, దీర్ఘకాలంగా వేధించే జబ్బులు ఉండటం, లివర్ కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ఉండటం, అధిక మానసిక ఒత్తిడి, చర్మం వ్యాధులు, హార్మోన్లు తక్కువగా ఉండటం, ఫంగల్ ఇన్ఫెక్షన్, వంశపారపర్యంగా రావడం వంటి కారణాలు అన్ని శరీర దుర్గంధానికి కారణం అవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని వీటిని అదుపులో ఉంచవచ్చు.

జీర్ణం శక్తి బలహీన పడినప్పుడు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. ఈ సమయంలోనే ఆహారం జీర్ణ కోసం లో ఉండిపోయి విష పదార్థంగా మారుతుంది. ఈ సమయంలోనే శరీరంలో విడుదలైన ఆమ్లాలతోనీ విడుదల కానీ మలాలతో కలిసి అది మరింత విష్పదార్థంగా మారే అవకాశం ఉంది. ఇలా శరీరంలో జరుగుతున్నప్పుడు చెమట రూపంలో ఈ విష పదార్థాలు బయటకు వచ్చి ఇబ్బంది పెడతాయి. అందుకే జీర్ణశక్తికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రపోవడం అజీర్తి సమస్యను తేలికగా తీసుకోవడం, రోజు మూత్రానికి వెళ్లకపోవడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఘాటైన ఆల్కహాల్ను తీసుకోకూడదు. కారంగా ఉన్న పదార్థాలు, నిల్వ ఉంచిన పదార్థాలు విషయంలో దూరంగా ఉండాలి. అలాగే అధికంగా థైరాయిడ్, నొప్పి నివారణ మందులు వాడాల్సి వస్తే వైద్యం సలహా మేరకు సూచనలు పాటించాలి..

ఒత్తిడి, విపరీతమైన ఆలోచనలు దూరంగా ఉంచుకొని జీవశక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వారానికి ఒకసారి అయినా వేపాకు, తులసి వేసి మరిగించిన నీటితో స్నానం చేయాలి. ఈ సమస్య ఉన్నవారు బద్ధకించకుండా రెండు పోట్ల స్నానం కచ్చితంగా చేయాలి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.