చిన్న పిల్లలకు ముద్దులు పెడుతున్నారా.. ఇది వారికి ఎంత ప్రమాదమో తెలుసా.. !

చిన్నపిల్లలు అంటేనే చూడడానికి ఎంతో ముద్దుగా అనిపిస్తారు. వారిని చూసి ఎత్తుకోకుండా ముద్దుపెట్టకుండా ఎవరూ ఉండలేరు. సాధారణంగా ఇది ప్రతి దగ్గర జరిగే పనే. అయితే చిన్న పిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారని

చిన్న పిల్లలకు ముద్దులు పెడుతున్నారా..  ఇది వారికి ఎంత ప్రమాదమో తెలుసా.. !


చిన్నపిల్లలు అంటేనే చూడడానికి ఎంతో ముద్దుగా అనిపిస్తారు. వారిని చూసి ఎత్తుకోకుండా ముద్దు   (Kissing a baby ) పెట్టకుండా ఎవరూ ఉండలేరు. సాధారణంగా ఇది ప్రతి దగ్గర జరిగే పనే. అయితే చిన్న పిల్లలు ఎంతో సున్నితంగా ఉంటారని.. వారిని ముద్దు పెట్టడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు పిల్లల్ని చుట్టుముట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.. 

లోకం తెలియని చిన్న పిల్లల్ని చూస్తే ఎంతో ముద్దుగా అనిపిస్తారు. ముఖ్యంగా వారితో ఆడుకుంటే సమయం తెలియకుండానే గడిచిపోతుంది. తల్లి, తండ్రి మాత్రమే కాకుండా చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా చిన్న పిల్లల్ని ప్రతి క్షణం ముద్దు చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా కనిపించగానే ఎత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే పిల్లల్ని అనారోగ్యం బారిన పడేస్తున్నామని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల వారికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా నవజాత శిశువులను అసలు ముద్దు పెట్టకూడదని చెబుతున్నారు. 

చిన్నపిల్లల్లో పెద్దవారి లాగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండదు. అందుకే వారిని తొందరగా అనారోగ్యాలు చుట్టుముడతాయి.. అందుకే పిల్లలను సొంత తల్లిదండ్రులతో సైతం ప్రతి ఒక్కరు ముద్దులు పెట్టడం విషయంలో దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే పిల్లలతో ఆడుకోవాలి అనిపిస్తే ఎత్తుకోవడం, కాసేపు ఆడించడం వంటివి చేయాలి కానీ దగ్గరగా తీసుకొని ప్రతిసారి ముద్దులు పెట్టడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. రోజంతా బయట తిరిగి రావడం, ఎక్కడెక్కడో ఆహారం తీసుకోవడం వంటి వాటి వలన ఎన్నో రకాల సూక్ష్మక్రిములు నోట్లో చేరుతాయి. పిల్లలు కనిపించిన వెంటనే వారిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టడం వల్ల ఈ క్రిములు వారి శరీరం మీద వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే పిల్లల్ని అనవసరంగా ముట్టుకోవటం, ముద్దులు పెట్టడం వంటివి చేయకూడదు.. 

Why kissing a newborn baby is a big NO!

అంతేకాకుండా పిల్లల శ్వాసకోస వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఊపిరితిత్తులు సైతం పూర్తిగా పరిపక్వం చెందటానికి ఒక వయసు రావాలి. ఇలా కాకుండా ప్రతి ఒక్కరూ పిల్లల్ని బుగ్గల పైన, పెదవుల పైన ముద్దులు పెట్టడం వల్ల సూక్ష్మక్రిమలు వారి శ్వాసకోస వ్యవస్థ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది. దీని వల్లనే వారికి పలు రకాల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దగ్గు, జలుబు జ్వరం వంటివి సమస్యలు ఉన్నప్పుడు పిల్లల దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది. దీనికి సంబంధించిన వైరస్ బ్యాక్టీరియాలు పిల్లల్ని సైతం చుట్టూ మట్టి వారిని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.. 

అలాగే ఎన్నో రకాల చర్మ సంబంధిత ఉత్పత్తులు, మేకప్ వంటివి పెద్దవాళ్లు ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొందరు లిప్స్టిక్స్ వంటివి వాడుతారు. వీటితో నేరుగా పిల్లల దగ్గరికి వెళ్లి ముద్దు చేయడం వల్ల అవి వారి శర్మానికి హాని చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో ఎన్నో ప్రమాదకర పదార్థాలు ఉపయోగిస్తారు. వీటితో పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.. 

అలాగే ఫ్లూ సమస్య పెద్దవారికి చాలా చిన్నదిగానే అనిపించినా పిల్లలకు మాత్రం చాలా ఇబ్బందిని కలిగిస్తుందని చిన్నపిల్లలకు తరచూ ముద్దలు పెట్టడం వల్ల జలుబు, ఫ్లూ వంటివి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యాధులు ఉన్నవారు పిల్లల్ని ముట్టుకున్న చర్మం ద్వారా స్పర్శ ద్వారా ఈ వైరస్ బ్యాక్టీరియా వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. 

అయితే పిల్లలకు తల్లి స్పర్శ ఎంతో అవసరం అని.. వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి తల్లి దగ్గరగా ఉండటం అవసరమని తెలుస్తోంది. అయితే తల్లి, తండ్రి, దగ్గర వాళ్లు పిల్లల్ని ఎత్తుకొని ఆడించడం, చుట్టూ పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో తిప్పటం వంటివి చేయవచ్చు. మూడు నెలల వయసు నిండే అంతవరకు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ముద్దు పెట్టకూడదు. ఆ తర్వాత తల్లి నెమ్మదిగా దగ్గరకు తీసుకోవచ్చు అని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.