Activated charcoal : యాక్టివేటెడ్‌ చార్‌ కోల్‌తో గ్యాస్‌, అసిడిటీ, మలబద్ధకం అన్ని బంద్‌..

Activated charcoal కు చెందిన ట్యాబ్లెట్లు మ‌న‌కు ల‌భిస్తాయి. వాటిని రోజూ ఉద‌యం సాయంత్రం భోజనానికి గంట ముందు 500 మిల్లీగ్రాముల మోతాదులో వేసుకుంటే.. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఉండ‌వు. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

Activated charcoal : యాక్టివేటెడ్‌ చార్‌ కోల్‌తో గ్యాస్‌, అసిడిటీ, మలబద్ధకం అన్ని బంద్‌..
Gas, acidity, constipation with activated charcoal


Activated charcoal.. చాలా మందికి ఈ పేరుతో పరిచయం అక్కర్లేదు. క‌ర్ర‌ల‌ను కాల్చ‌డం వ‌ల్ల వ‌చ్చే బొగ్గును charcoal అంటారు. అయితే ఆ చార్ కోల్‌నే  Activated charcoal అని భావిస్తుంటారు. ఇది తప్పు.. ఇవి రెండూ వేరు.. ఎందుకంటే యాక్టివేటెడ్ చార్ కోల్ వేరే. అది న‌లుపు రంగులో ఉండే ఒక పొడి. కొబ్బ‌రి టెంక‌ల‌ను లేదా పొట్టును కాల్చ‌డం వ‌ల్ల అది త‌యార‌వుతుంది. దాన్ని పొడి రూపంలో త‌యారు చేసి విక్ర‌యిస్తారు. మార్కెట్‌లో మ‌న‌కు ఇది ల‌భిస్తుంది. అయితే దీన్ని చాలామంది ఫేస్‌కు వాడుతుంటారు. దీనివల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. అవేంటంటే..

Activated charcoal కు చెందిన ట్యాబ్లెట్లు మ‌న‌కు ల‌భిస్తాయి. వాటిని రోజూ ఉద‌యం సాయంత్రం భోజనానికి గంట ముందు 500 మిల్లీగ్రాముల మోతాదులో వేసుకుంటే.. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం ఉండ‌వు. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

చ‌ర్మాన్ని స‌హ‌జ‌సిద్ధంగా డిటాక్స్ చేసే గుణాలు యాక్టివేటెడ్ చార్‌కోల్‌లో ఉన్నాయి. దీంతో ఫేస్ మాస్క్‌ వేసుకుంటే కాంతివంతంగా మారుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి.
మ‌నం తీసుకునే ఆహారాలు, ద్ర‌వాల వ‌ల్ల అప్పుడ‌ప్పుడు ఫుడ్ పాయిజ‌నింగ్ అవుతుంటుంది. దీంతో విరేచ‌నాలు, వాంతులు అవుతాయి. ఈ స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్ల‌ను వాడాలి. పూట‌కు ఒక‌టి చొప్పున 500 మిల్లీగ్రాముల మోతాదులో వాడితే ఫ‌లితం ఉంటుంది.
మ‌ద్యం విప‌రీతంగా తాగడం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌స్తుంది. అలాంట‌ప్పుడు యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను వాడితే ఫ‌లితం ఉంటుంది. పురుగులు కుట్టిన చోట యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను కొబ్బ‌రినూనెతో క‌లిపి రాయాలి. స‌మ‌స్య వెంట‌నే త‌గ్గుతుంది.
మ‌న పూర్వీకులు బొగ్గుతో దంతాల‌ను తోముకునేవారు. ఇప్ప‌టికీ కొన్ని చోట్ల కొంద‌రు బొగ్గుతోనే దంతాల‌ను క్లీన్‌ చేసుకుంటారు.. యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో దంతాల‌ను తోముకోవ‌డం వ‌ల్ల దంతాలు శుభ్రంగా, తెల్లగా మారుతాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది.
శ‌రీరంలోని విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోయి శ‌రీరం అంత‌ర్గతంగా శుభ్రంగా మారాలంటే యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్ల‌ను వారం రోజుల పాటు వాడాలి. వాటిని ఉద‌యం, సాయంత్రం ఒక్క ట్యాబ్లెట్ చొప్పున 250 మిల్లీగ్రాముల మోతాదులో వాడితే శ‌రీరం అంత‌ర్గతంగా శుభ్రంగా మారుతుంది. వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు పోతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.