తెల్ల రక్త కణాలు కౌంట్ పెరగాలా.. ఈ ఆహారం తీసుకోవాల్సిందే..!

సాధారణంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు కౌంట్ పడిపోతూ ఉంటుంది. అయితే వీటి సంఖ్యను పెంచుకోవాలి అంటే కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే.. అవి ఏంటంటే..

తెల్ల రక్త కణాలు కౌంట్ పెరగాలా.. ఈ ఆహారం తీసుకోవాల్సిందే..!


సాధారణంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు కౌంట్ పడిపోతూ ఉంటుంది. అయితే వీటి సంఖ్యను పెంచుకోవాలి అంటే కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే.. అవి ఏంటంటే..

High White Blood Cell Count? What You Should Know

సిట్రస్ జాతి పండ్లు..

తెల్ల రక్త కణాల కౌంట్ పెంచాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో ముఖ్యంగా సిట్రస్ ఒకటి.. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రాజాతి పండ్లు తెల్ల రక్త కణాలు సంఖ్యను పెంచడంతోపాటు పెట్టిన సైతం పెంచుతాయి.. నారింజ, నిమ్మ, పైనాపిల్ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

వెల్లులి..

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచాలంటే వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది.. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడంతోపాటు ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేస్తుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను అదుపులో ఉంచుతుంది. గుండెకు సంబంధించిన పలు రకాల సమస్యలు రాకుండా కాపాడటంలో వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్..

ఇందులో విటమిన్ బి 6, విటమిన్ ఈ, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

బాదం..

ఎముకలు దృఢంగా మార్చి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో బాదం ముందు ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.. దీనిని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరంగా ఉంటాయి.

సీజనల్ ఫ్రూట్స్..

బొప్పాయి లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపులు మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది. అందుకే ఈ పండును తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. అంతేకాకుండా ద్రాక్ష దానిమ్మ వంటివి సైతం శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.

పసుపు..

ఎన్నో ఏళ్ల నుంచి భారతీయ వంటకాలలో భాగం అయిపోయిన పసుపు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే పళ్ళు రకాల వైరస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.