మధుమేహం, రక్తపోటు, గుండె పోటు దరిచేరకూడదు అనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

40 ఏళ్లు దగ్గరపడేటప్పటికీ మధుమేహం రక్తపోటు సమస్యలు వెనువెంటే వస్తున్నాయి వీటితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు సాధారణం అయిపోయాయి ఒకప్పటి రోజుల్లో ఎలా బతికేవారు అన్న విషయాన్ని

మధుమేహం, రక్తపోటు, గుండె పోటు దరిచేరకూడదు అనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!


40 ఏళ్లు దగ్గరపడేటప్పటికీ మధుమేహం రక్తపోటు సమస్యలు వెనువెంటే వస్తున్నాయి వీటితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు సాధారణం అయిపోయాయి ఒకప్పటి రోజుల్లో ఎలా బతికేవారు అన్న విషయాన్ని మరిచిపోయి అందరికీ వస్తున్న ఆరోగ్య సమస్యలే కదా అంటూ లైట్ తీసుకుంటున్నారు ఇలా చేయడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అయితే శరీరంలో రక్తపోటుని మధుమేహాన్ని రాకుండా అదుపు చేయాలంటే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఒకప్పుడు 60 ఏళ్లు ఉన్నవారికి గుండెపోటు వచ్చేది 50 ఏళ్లు దాటిన వారిలో కొంతమందికి మధుమేహం అక్కడక్కడ రక్తపోటు వంటి సమస్యలు కనిపించేవి కానీ ఈ రోజుల్లో 30 ఏళ్లకే గుండెపోట్లు వస్తున్నాయి అలాగే మధుమేహం బీపీలు సైతం 4ఏళ్ళు రాకుండానే మనిషిని చుట్టుముడుతున్నాయి.

కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు మరింతగా పెరిగిపోయాయి ముఖ్యంగా చాలామందికి శ్వాసకోశ సంబంధ సమస్యలు దరిచారుగా సింహం చేసే వారికి ఊబకాయం సరైన జీవన్ సైలు లేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి కొంతమందిలో ఇవి చాలా ప్రభావం చూపిస్తున్నాయి. వీటి నుండి బయటపడి ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని ఏర్పరచుకుంటే అన్ని సమస్యలు దూరం అవుతాయి.

గ్రామాల్లో కన్నా పట్టణాల్లో ఉండేవారు ఎక్కువగా సిటీ కల్చర్కు అలవాటు పడుతూ ఉన్నారు. దీంతో ఉరుకుల పరుగులు జీవితంలో వండుకొని తినే ఓపిక లేక రోజు బయట ఆహారం మీద ఆధారపడుతున్నారు నలుగురితో పాటే మనము అనుకుంటూ బయట దొరికే ఆహార పదార్థాలు ఫాస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ బేకరీ పదార్థాలు వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు వీటితోపాటు ఆదివారాల్లో బిర్యానీలు చికెన్ వంటివి ఎక్కువగా లాగిన్ చేయడం వల్ల శరీరం సమతా స్థితిని కోల్పోతుంది అందుకే ఇలాంటి వాటిని తగ్గించాలి.

రోజు ఎక్కడో అక్కడ మన కంటికి కనిపిస్తూనే వస్తున్న వ్యాయామానికి సంబంధించిన వార్తలని చాలామంది అజాగ్రత్త చేస్తూ ఉంటారు వ్యాయమం చేయాలని ఎంత చెబుతున్నా ఈ విషయాన్ని చెవికి ఎక్కించుకోరు కానీ రోజు కాస్త సమయం అయినా వాకింగ్ జాగింగ్ రన్నింగ్ వంటివి చేస్తూ ఉండాలి కొంత సమయం యోగా ధ్యానం వంటి వాటికీ కేటాయించడం వల్ల శరీరంలో అనారోగ్యాలు దరి చేరవు.

ఎంత హడావిడి జీవితం అయినా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే నిద్ర లేవటం, రోజు ఎక్కువగా నీరు తాగటం, పోషకాహారం తీసుకోవడం, మాంసాహారాన్ని తగ్గించి పండ్లు కాయగూరలు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల చిన్న వయసులోనే వచ్చే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.