తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే చిట్కా..

ఈ రోజుల్లో చాలా మంది.. అధిక బరువు, మధుమేహం, బీపీతో బాధపడుతున్నారు.. ఇవి ఒకరకమైన రోగాలు అయితే.. వీటివల్ల జుట్టు ఊడిపోవడం ఇంకా బాధను కలిగిస్తుంది. జుట్టు రాలిపోవడమే కాదు..

తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే చిట్కా..


ఈ రోజుల్లో చాలా మంది.. అధిక బరువు, మధుమేహం, బీపీతో బాధపడుతున్నారు.. ఇవి ఒకరకమైన రోగాలు అయితే.. వీటివల్ల జుట్టు ఊడిపోవడం ఇంకా బాధను కలిగిస్తుంది. జుట్టు రాలిపోవడమే కాదు.. తెల్లగా అవడం కూడా చాలా మందిని వేధిస్తున్న సమస్య. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి చాలా మంది చాలా రకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. హెయిర్‌ డైలు వాడటం వల్ల ఫలితం త్వరగా వచ్చినప్పటికీ.. కానీ అది వారం రోజులే. మళ్లీ మామూలే. ఈ సమస్యను శాశ్వతంగా నయం చేసుకోవాలంటే.. ఆయుర్వేద మార్గాలు పాటించడమే మార్గం. మాన‌సిక ఒత్తిడి, మారిన జీవ‌న విధానం, పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన ఆహార‌పు అల‌వాట్లు వంటి వాటిని మ‌నం తెల్ల జుట్టు రావ‌డానికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి మ‌నం ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా స‌హ‌జసిద్ధంగా ల‌భించే ప‌దార్థాలను ఉప‌యోగించి మ‌నం తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. జుట్టును న‌ల్ల‌గా మార్చే హెయిర్ ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మ‌నం నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగును, ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును, 2 టేబుల్ స్పూన్ల గుంట‌గ‌ల‌గ‌రాకు (భృంగ‌రాజ్) మొక్క స‌మూల పొడిని ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా ఒక గిన్నెలో పెరుగును, క‌ల‌బంద గుజ్జును వేసి క‌ల‌పండి.. త‌రువాత గుంట‌గ‌ల‌గ‌రాకు మొక్క స‌మూల పొడిని వేసి అన్నీ క‌లిసేలా మ‌రోసారి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌రి వ‌ర‌కు పూర్తిగా పట్టించాలి. ఇలా ప‌ట్టించిన 30 నిమిషాల త‌రువాత హెర్బ‌ల్ షాంపుతో లేదా ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉన్న షాంపూతో త‌ల‌స్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వేసుకోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

ఈ హెయిర్ ప్యాక్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాకుండా చుండ్రు, జుట్టు రాల‌డం, జుట్టు తెగిపోవ‌డం వంటి ఇత‌ర జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు లేనివారు కూడా ఈ హెయిర్ ప్యాక్‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. పైగా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.