ముఖంపై ఎన్ని మొటిమలు ఉన్నా.. ఈ చిట్కాతో అన్నీ మాయం..!

చర్మ సంబంధిత సమస్యల్లో మొదటగా ఉండేది ఈ పింపుల్స్‌.. ఇంతకు ముందు టీన్‌జ్‌లో మాత్రమే వచ్చేవి.. కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా.. 25 ఏళ్లు దాటాక కూడా మొటిమలు, ఆ గుంటలు అసలు ముఖం అంతా నాశనం చేసేస్తున్నాయి.

ముఖంపై ఎన్ని మొటిమలు ఉన్నా.. ఈ చిట్కాతో అన్నీ మాయం..!


చర్మ సంబంధిత సమస్యల్లో మొదటగా ఉండేది ఈ పింపుల్స్‌.. ఇంతకు ముందు టీన్‌జ్‌లో మాత్రమే వచ్చేవి.. కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా.. 25 ఏళ్లు దాటాక కూడా మొటిమలు, ఆ గుంటలు అసలు ముఖం అంతా నాశనం చేసేస్తున్నాయి.. ఫస్ట్‌ ఒక్క పింపుల్‌ వచ్చింది.. అది పోతుంది అనుకునేలోపు.. అది పిల్లల్ని గిట్లా పెడతుందో ఏమో.. పక్కనే ఇంకో రెండు.. ఆ తర్వాత ఇంకోటి.. ఇలా మొత్తం స్ప్రెడ్‌ చేస్తాయి.. పాపం చాలామంది ముఖం పింపుల్స్‌తోనే నిండిపోతుంది. మీకు కూడా లెక్కలేనన్ని పింపుల్స్‌ ఉండి ఫేస్‌ అంతా ఆగం అయితే.. ఇక ఏం క్రీమ్స్‌ వాడకుండా.. సింపుల్‌గా ఈ ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి.. పింపుల్స్‌ బ్యాచ్‌ అంతా నాశనం అవుతుంది.  

మొటిమ‌ల కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌న‌డ‌బ‌తుంది. దీంతో చాలా మంది ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు గుర‌వుతూ ఉంటారు. స‌హ‌జసిద్ధ‌మైన ప‌దార్థాల‌తో ఇంట్లోనే పేస్ట్ చేసుకుని వాడ‌డం వ‌ల్ల మొటిమ‌ల‌ స‌మ‌స్య నుంచి మ‌నం త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. మొటిమ‌ల స‌మ‌స్య‌ను న‌యం చేసే ఈ పేస్ట్‌ను ఎలా త‌యారుచేసుకోవాలంటే..
ఇందుకోసం మ‌నం వేప ఆకుల పొడిని, ముల్తానీ మ‌ట్టిని, గులాబీ నీరును ఉప‌యోగించాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ ముల్తానీ మ‌ట్టిని, ఒక టీ స్పూన్ వేప ఆకుల పొడిని వేయాలి. త‌రువాత త‌గిన‌న్ని గులాబీ నీటిని పోస్తూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పేస్ట్‌ను మొటిమ‌లు ఉన్న చోట మాత్ర‌మే రాయాలి. ఇలా రాసిన 20 నిమిషాల త‌రువాత ముఖాన్ని నీటితో క‌డిగేయాలి. ఇలా రోజులో ఎన్నిసార్లైనా ఈ పేస్ట్‌ను మ‌నం మొటిమ‌ల మీద రాసుకోవ‌చ్చు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు చాలా త్వ‌ర‌గా త‌గ్గుతాయి. 
మరో చిట్కా ఏంటంటే.. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ చంద‌నం పొడిని, ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును తీసుకోవాలి. ఇందులోనే త‌గిన‌న్ని గులాబీ నీటిని పోస్తూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఆరిన త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల కూడా ముఖంపై వ‌చ్చే మొటిమ‌ల‌తోపాటు మొటిమ‌ల కార‌ణంగా వ‌చ్చే మ‌చ్చ‌లు కూడా త‌గ్గుతాయి. చంద‌నం పొడి అందుబాటులో లేని వారు దానికి బ‌దులుగా శ‌న‌గ‌పిండిని కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమలు త‌గ్గ‌డంతోపాటు కొత్త మొటిమ‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా చ‌ర్మం అందంగా, మృదువుగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.