వయాగ్రా వాడకూడని సందర్భాలు ఏంటంటే..? వీరు అస్స‌లు వాడ‌కూడ‌దండోయ్‌..!

కొన్ని సందర్భాలలో వయాగ్రాను వాడకూడదు.. ముఖ్యంగా మద్యం సేవించి ఉన్నప్పుడు వయాగ్రాని వాడితే పురుషాంగానికి రక్తం సరఫరా చేసే ధమనులు దెబ్బతింటాయని తెలుస్తోంది అలాగే డ్రగ్స్

వయాగ్రా వాడకూడని సందర్భాలు ఏంటంటే..? వీరు అస్స‌లు వాడ‌కూడ‌దండోయ్‌..!


శృంగారాన్ని ఎక్కువ సేపు చేయాలని ఆలోచనతో వయాగ్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా మగవారు దీనిని ఫాలో అయిపోతూ ఉంటారు అయితే వీటిని ఉపయోగించడం వల్ల శృంగారం సమయంలో లాభాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది అవి ఏంటంటే.  

కొన్ని సందర్భాలలో వయాగ్రాను వాడకూడదు.. ముఖ్యంగా మద్యం సేవించి ఉన్నప్పుడు వయాగ్రాని వాడితే పురుషాంగానికి రక్తం సరఫరా చేసే ధమనులు దెబ్బతింటాయని తెలుస్తోంది అలాగే డ్రగ్స్ సేవించిన సమయంలో సైతం దీనిని వాడకూడదు.

ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి మందులు వాడుతున్న సమయంలో సైతం వయాగ్రాను ఉపయోగించకూడదు. ఇంకా హార్ట్ ఎటాక్ హిస్టరీ, లో బీపీ, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, కంటి చూపు సమస్యలు ఉన్న వ్యక్తులు వయాగ్రాకు దూరంగా ఉండాలి. కడుపులో అల్సర్లు, హీమోఫిలియా, అనీమియా, లుకేమియాతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా మేరకే వయాగ్రా ఉపయోగించాలి.

సాధారణంగా అంగస్తంభన జరగని వారు డాక్టర్ సలహా లేకుండా వయాగ్రాను వాడకూడదు దీని వలన మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర మందుల్లాగే వయాగ్రా వాడినప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కళ్లు తిరగడం, భ్రాంతికి లోనవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్‌కు లోనైనప్పుడు వయాగ్రాకు దూరంగా ఉండాలి.

అలాగే సెక్స్ చేయాలని సమయంలో వయాగ్రాను ఉపయోగించకూడదు. అలాగే వయాగ్రా మగాళ్లకు మాత్రమే ఉద్దేశించింది. ఇది మహిళల్లో కామోద్రేకాన్ని పెంచదు. కాబట్టి లైంగిక వాంఛల లేమితో సతమతం అవుతున్న మహిళలు డాక్టర్‌ను సంప్రదించాలి. చర్మ సంబంధ సమస్యలు ఏవైనా అలర్జీలు ఉన్నవారు సైతం వీటికి దూరంగా ఉండటం మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.