మొక్క జొన్న పీచును పడేస్తున్నారా.. ఇది తెలిస్తే బంగారంలా దాచుకుంటారు..

మానవ శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం ఏదొక జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి..మన శరీరంలో రక్తాన్ని నిరంతరం వడపోస్తూ

మొక్క జొన్న పీచును పడేస్తున్నారా.. ఇది తెలిస్తే బంగారంలా దాచుకుంటారు..


మానవ శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం ఏదొక జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి..మన శరీరంలో రక్తాన్ని నిరంతరం వడపోస్తూ మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి..అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ నేటి తరుణంలో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఫాస్పేట్ వంటివి ఉంటాయి. ఎప్పుడేతే మూత్రంలో ఈ పోషకాల శాతం ఎక్కువవుతుందో అవి మూత్రపిండాల్లో కొద్ది కొద్దిగా పేరుకుపోయి చిన్న చిన్న రాళ్ల లాగా ఏర్పడుతాయి. ఈ రాళ్లు క్రమంగా పెద్దవి అయ్యి తీవ్రమైన నొప్పికి దారి తీస్తాయి.. ఇప్పుడు మనం వీటిని తగ్గించే చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం..

మొక్కజొన్న: మనకు పనికిరాదు అని పడేసే ఈ పీచుతో టీ పెట్టుకుంటే ఎన్ని ఆరోగ్య  ప్రయోజనాలో తెలుసా..? | NewsOrbit


ఈ రాళ్లను తొలగించడంలో మొక్కజొన్న పీచు ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పీచుతో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఒక మొక్కజొన్న పీచును వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. తరువాత వీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, 2 టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రెండు పూటలా భోజనం చేసిన తర్వాత అరగంటకు తాగాలి.. రాళ్లు కరిగిపోతాయి.. అలాగే రణపాలా ఆకును తీసుకున్న మంచిది ఫలితం ఉంటుంది.. ఇంకా ముల్లంగిని తీసుకున్న కూడా మంచిది ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.